Tollywood: ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్.. సినిమా వస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఈ హీరోను గుర్తుపట్టారా..?
దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరో. కన్నడలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు పాత్ర ప్రాధ్యానత ఉంటే ఇతర భాషలలో కీలకపాత్రలు పోషించేందుకు రెడీ అయ్యారు. తాజాగా రెట్రో లుక్ లోకి మారిపోయారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

పైన ఫోటోను చూశారా.. ? అందులో రెట్రో లుక్ లో కనిపిస్తున్న నటుడు సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరు. అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆయన సినిమా వస్తుందంటే చాలా థియేటర్లలో జాతరే. ఆయన వెండితెరపై కాసేపు కనిపించినా సరే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఇప్పుడిప్పుడే ఇతర భాషలలో పలు చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కన్నడలో సూపర్ స్టార్.. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంటాయి. ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ? ఆయనే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్. ఈ చిత్రానికి సప్త సాగరాలు దాటి ఫేమ్ హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు ముందే భారీ హైప్ నెలకొన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో శివరాజ్ కుమార్ ధనుంజయ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఆయన రెట్రో లుక్ లో కనిపిస్తున్నారు. సూటూబూటూ వేసుకుని.. టై కట్టుకుని ఓ చేతిలో రివాల్వర్ పట్టుకుని సీరియస్ గా కనిపిస్తున్నారు. పుష్ప డాలి ధనంజయ కీలకపాత్రలో నటిస్తున్నారు.
వన్న ప్రతి సినిమాలో కొత్త పాత్రలను ప్రయత్నిస్తాడు. ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ కూడా ఆ లైన్ లోకి చేరుతుంది. సినిమాలో రెట్రో కథ ఉంటుందని తెలుస్తోంది. ‘వైశాక్ జె. ఫిల్మ్స్’ బ్యానర్ ద్వారా డాక్టర్ వైశాక్ జె. గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..
Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..
Tollywood : అప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్తో రచ్చ.. ఎవరంటే..
Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్లో ఊహించని విధంగా..








