R.Madhavan: యంగ్ లుక్ వెనుక ఉన్న 20 ఏళ్ల సీక్రెట్ రివీల్ చేసిన మాధవన్! ట్రై చేసి తీరాల్సిందే
ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తన యంగ్ లుక్‌కి రహస్యం గురించి చెప్పి అందరినీ ఆశ్యర్యపరిచారు. 55 ఏళ్ల మాధవన్ ఇప్పటికీ 30–35 ఏళ్ల వయసు వాడిలా కనిపిస్తారు. ఆయన యంగ్ లుక్‌కి అమ్మాయిలే అబ్బాయిలు కూడా అసూయపడుతుంటారు. యంగ్ లుక్ కోసం ఏం ..

ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తన యంగ్ లుక్ రహస్యం గురించి చెప్పి అందరినీ ఆశ్యర్యపరిచారు. 55 ఏళ్ల మాధవన్ ఇప్పటికీ 30–35 ఏళ్ల వయసు వాడిలా కనిపిస్తారు. ఆయన యంగ్ లుక్‌కి అమ్మాయిలే అబ్బాయిలు కూడా అసూయపడుతుంటారు. యంగ్ లుక్ కోసం ఏం తింటారు, ఏం చేస్తారు తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఆయనకు ఎదురైన ఇదే ప్రశ్నకు ఆయన సీక్రెట్ రివీల్ చేశారు. 20 ఏళ్ల నుంచి దానినే ఫాలో అవుతున్నానంటూ మాధవన్ చెప్పిన సీక్రెట్ అందరిని ఆశ్చర్యపరిచింది.
తన యంగ్ లుక్ సీక్రెట్ ఆయుర్వేద విధానాలే అని తెలిపారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, బాటక్స్ లేదా ఫిల్లర్స్ వంటి కాస్మెటిక్ ట్రీట్‌మెంట్స్‌కు దూరంగా ఉంటూ నేచురల్ దొరికే వాటినే వాడుతానని చెప్పారు. “నా రొటీన్ చాలా సింపుల్. చిన్నప్పటి నుంచే ప్రతి ఆదివారం నూనె స్నానం చేస్తాను. సెసమీ ఆయిల్‌తో శరీరమంతా, ముఖ్యంగా తలకు రాసుకుని స్నానం చేస్తాను. మిగతా రోజుల్లో కొబ్బరి నూనె ఉపయోగిస్తాను” అని మాధవన్ తెలిపారు. ఈ ఆయుర్వేద పద్ధతిని 20 ఏళ్లకు పైగా అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు.
చర్మ సంరక్షణకు కూడా సహజ మార్గాలే తన ఎంపిక అని చెప్పారు మాధవన్. ‘ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యకిరణాలు తనపై పడేలా గోల్ఫ్ ఆడుతానన్నారు. సన్‌టాన్ అవుతాను కానీ, చర్మం టైట్ అయి ముడతలు రాకుండా ఉంటుంది. ఫిల్లర్స్ లేదా ఎన్‌హాన్స్‌మెంట్స్ ఏం చేయించలేదు. అప్పుడప్పుడు రోల్ కోసం ఫేషియల్ చేస్తాను. కేవలం కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు, సూర్యకాంతి, శాఖాహారమే నా చర్మాన్ని కాపాడుతున్నాయి’ అని అన్నారు.
తాను శాఖాహారినని, ఇంట్లో వండిన తాజా ఆహారాన్నే ఇష్టపడతానని మాధవన్ చెప్పారు. ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉంటానని తెలిపారు. ఈ సహజ జీవనశైలి వల్లే 55 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తున్నానని ఆయన అభిప్రాయపడ్డారు.
అభిమానులు మాధవన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ను ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు. ఏజింగ్‌ను సహజంగా ఆనందిస్తానని, దాన్ని దాచడానికి ప్రయత్నించనని ఎప్పుడూ చెప్తారు. ఈ ఆయుర్వేద రొటీన్‌తోనే ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటున్నానని స్పష్టం చేశారు.




