నేను గత రెండు సంవత్సరాల కాలంగా టీవీ9 తెలుగు డిజిటల్లో పనిచేస్తున్నాను. టెక్నాలజీ, పర్సనల్ ఫినాన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ రాయడంలో అనుభవం ఉంది. అలాగే కొత్త గాడ్జెట్స్, లైఫ్ స్టైల్‌కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను.
Samsung Smart watch: ఫ్రీగా స్మార్ట్ వాచ్ ఇస్తున్న సామ్సంగ్.. కావాలంటే పోటీలో పాల్గొనాల్సిందే..!
ఇటీవల కాలంలో స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు నూతన మోడల్స్ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా సామ్సంగ్ కూడా తన అమ్మకాలను పెంచుకునేందుకు కొత్త పోటీతో మన ముందుకు వచ్చింది. గెలిచిన వారికి ఫ్రీగా స్మార్ట్ వాచ్ ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సామ్సంగ్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
- Srinu
- Updated on: Apr 23, 2025
- 7:45 pm
Smart Phones: మార్కెట్లో ఆ ప్రధాన ఫోన్స్ మధ్యే పోటీ.. దిబెస్ట్ ఫోన్ ఏదంటే..?
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం బాగా ఎక్కువైంది. గతంలో కేవలం కాల్స్ మెసేజ్‌లకు మాత్రమే వాడే ఫోన్లు క్రమేపి అధునాత ఫీచర్లతో అప్డేట్ అయ్యాయి. దీంతో యువత స్మార్ట్ ఫోన్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో రూ.25 వేల కంటే తక్కువ ధరలో రెండు ప్రధాన ఫోన్లపై మధ్య పోటీ నెలకొంది. ఆ రెండు ఫోన్ల ఫీచర్లతో పాటు ఇతర అంశాల మధ్య ఉన్న ప్రధాన తేడాలను తెలుసుకుందాం.
- Srinu
- Updated on: Apr 23, 2025
- 7:26 pm
Akshaya tritiya: బంగారం స్వచ్ఛతకు లెక్కలుంటాయి.. ఆ నంబర్ల వెనుకున్న అర్థం ఇదే..!
బంగారమంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండగలు, శుభకార్యాలు, పుట్టినరోజులు.. ఇలా ప్రతిసారి దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి బాగా ఇష్టపడతారు. తాము పొదుపు చేసుకున్న డబ్బులతో వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే బంగారాన్నికొనడానికి అక్షయ తృతీయ రోజు మంచి ముహూర్తమని భావిస్తారు. ఈ రోజునే సమీపంలోని బంగారం దుకాణాల వద్దకు వెళ్లి తమ స్థోమతకు తగినట్టుగా కొనుగోలు జరుపుతారు. అయితే బంగారం కొన్నప్పుడు వాటి స్వచ్ఛత స్థాయిపై అవగాహన ఉండాలి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- Srinu
- Updated on: Apr 23, 2025
- 5:00 pm
Success story: 13 ఏళ్లకే కంపెనీకి సీఈవో.. కేరళ బాలుడి విజయగాథ..!
సాధారణంగా 13 ఏళ్ల వయసున్న పిల్లలు స్కూల్లో 8వ తరగతి చదువుతూ ఉంటారు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తోటి పిల్లలతో ఆడుకుంటారు. లేకపోతే ట్యూషన్ కు వెళుతూ చదువులో బిజీగా ఉంటారు. తల్లి లేదా తండ్రి మొబైల్ తీసుకుని గేమ్స్ ఆడతారు. కానీ అదే వయసున్న ఆదిత్యన్ రాజేష్ ఒక మొబైల్ ఆప్లకేషన్ ను డెవలప్ చేసి తన సొంత ఐటీ కంపెనీని స్థాపించాడు. ఇతడి యూట్యూబ్ చానల్ కు లక్షల మంది సబ్ స్రైబర్లు ఉన్నారు. అత్యంత చిన్న వయసు సీఈవోగా గుర్తింపు పొందిన ఆదిత్యన్ రాజేష్ గురించి తెలుసుకుందాం.
- Srinu
- Updated on: Apr 23, 2025
- 4:45 pm
National pension scheme: పదవీ విరమణ పెట్టుబడితో బోలెడు లాభాలు.. విత్‌డ్రాకు పరిమితులు ఇవే..!
జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్)లో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ డబుల్-బెనిఫిట్ ఎంపికగా నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ స్కీమ్ ద్వారాా పదవీ విరమణ నిధిని నిర్మించడంతో పాటు పెట్టుబడులపై పన్ను మినహాయింపులను పొందవచ్చు. ఫిబ్రవరిలో సమర్పించిన బడ్జెట్లో ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 12 లక్షలకు పెంచింది. ఇది పన్ను ఆదా చేయడానికి ఎన్పీఎస్ వంటి ఎంపికలను ఉపయోగించే పెట్టుబడిదారులలో ప్రశ్నలను లేవనెత్తింది. అంటే వారు ఇప్పుడు తమ డబ్బును ఉపసంహరించుకోవచ్చా? అనే అనుమానం అందరికీ ఉంటుంది.
- Srinu
- Updated on: Apr 23, 2025
- 4:30 pm
Home Loan: హోమ్‌లోన్ ఈఎంఐ బాదుడు ఎక్కువగా ఉందా? ఈ టిప్స్‌తో ఆ సమస్యలన్నీ దూరం
సొంత ఇల్లు అనేది ప్రతి మధ్య తరగతి ఉద్యోగి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు ఏళ్లుగా పొదుపు చేసుకున్న సొమ్ముతో పాటు హోమ్ లోన్ తీసుకుని సొంతం ఇల్లు కట్టుకోవడం గానీ, కొనుగోలు చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్బీఐ రెపో రేట్లను సవరించడంతో గృహ రుణాల ఈఎంఐలు తగ్గాయి. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ఈ ఈఎంఐలను ఇంకా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- Srinu
- Updated on: Apr 23, 2025
- 4:15 pm
Air Conditioners: ఏసీల వల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా..? ఈ టిప్స్‌తో ఆ సమస్య ఫసక్
భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రజల జీవన విధానం మారుతుంది. ఇటీవల కాలంలో దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల నుంచి రక్షణకు ఎయిర్ కండిషనర్స్ (ఏసీ)లు వాడడం తప్పనిసరైంది. గతంలో సంపన్న వర్గాలకే పరమితమైన ఏసీలు ఇప్పడు మధ్యతరగతితో ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా వాడుతున్నారు. అయితే ఏసీల వాడకం వల్ల కరెంట్ బిల్లుల బాదుడుపై భయపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొన్ని టిప్స్ పాటిస్తే ఏసీలు వాడినా కూడా తక్కువ కరెంట్ బిల్లు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో? ఓసారి తెలుసుకుందాం.
- Srinu
- Updated on: Apr 23, 2025
- 3:56 pm
Airconditioners: ఆ వార్తలన్నీ పుకార్లే.. ఫ్రీ ఏసీల స్కీమ్‌పై కేంద్రం స్పష్టత
ఇటీవల కాలంలో ఫేక్ వార్తలు ఎక్కువయ్యాయి. ఓ తెలుగు సినిమాలో చెప్పినట్లు నిజం గడపదేటే లోపు అబద్ధం పది ఊళ్లను చుట్టేస్తుందనే చందాన ఫేక్ వార్తల వ్యాప్తి బాగా ఎక్కువైంది. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏసీ యోజన స్కీమ్ కింద ఫ్రీగా ఏసీలు ఇస్తున్నారనే వార్త హల్చల్ చేసింది. అయితే ఇది ఫేక్ వార్త అని పీఐబీ స్పష్టం చేసింది.
- Srinu
- Updated on: Apr 22, 2025
- 7:47 pm
Best smartphone: ఈ ఫోన్స్ ఉంటే కెమెరా వద్దంతారంతే.. రూ.30 వేలల్లో ది బెస్ట్ ఫోన్స్ ఇవే..!
మన జీవితంలో గడిచిన ఒక్క క్షణాన్ని కూడా ఎప్పుడూ వెనక్కి తీసుకురాలేం. ఎంత డబ్బున్నా, ఎంత టెక్నాలజీ పెరిగినా ఇది మాత్రం సాధ్యం కాదు. అయితే గడిచిన రోజులోని మధుర సంఘటనలను మాత్రం ఫొటో రూపంలో చూసుకోవచ్చు. అందుకే ఫొటోకు ఎంతో విలువ ఉంటుంది. గతంలో ఫోటోలు తీసుకోవాలంటే స్డూడియోలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ నేడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాటిలోని కెమెరాతో ఎక్కడబడితే అక్కడ ఫొటోలు తీసుకునే వెసులుబాటు లభించింది. కెమెరా మంచిదైతే నాణ్యమైన ఫొటోలు వస్తాయి. ఏప్రిల్ నెలలో మార్కెట్ లోకి రూ.30 వేల ధరలో అనేక స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. వాటిలో మంచి కెమెరా, డిస్ ప్లే, బ్యాటరీ కలిగిన వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- Srinu
- Updated on: Apr 22, 2025
- 6:00 pm
Whatsapp: ఈ ఫీచర్ ఉంటే అన్ని భాషలూ వచ్చినట్టే.. వాట్సాప్ యూజర్లకు పండగే..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక కోట్ల మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. వాట్సాప్ యాజమాన్యం కూడా నిత్యం అప్ డేట్లు చేస్తూ యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందజేస్తోంది. ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్ ను పరీక్షిస్తోంది. దీని ద్వారా ఆండ్రాయిడ్ యూజర్ల యాప్ లోనే చాట్ మెసేజ్ లను నేరుగా అనువాదం చేసుకోవచ్చు. వేరే భాషలో వచ్చిన చాట్ లను సొంత భాషలో చదువుకోవడానికి దీని ద్వారా వీలు కలుగుతుంది.
- Srinu
- Updated on: Apr 22, 2025
- 5:30 pm
International Space Station: అంతరిక్షమే హద్దుగా.. ఐఎస్ఎస్కు వెళ్లనున్న భారత వ్యోమగామి
అంతరిక్ష రంగంలో మన దేశం ఎన్నో విజయాలను సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అమెరికా తదితర దేశాలు కూడా మన సాంకేతికను అభినందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయడం, మెరుగైన ఫలితాలు సాధించడం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రత్యేకత. సైకిల్ పై రాకెట్లను తరలించిన పరిస్థితి నుంచి వివిధ దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించే స్థాయి వరకూ మనదేశం ఎదిగింది. ఇప్పుడు మరో కొత్త చరిత్రను రాయడానికి ఇస్రో సిద్ధమైంది. ఈ ఏడాది మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్)కు వ్యోమగామిని పంపనుంది.
- Srinu
- Updated on: Apr 22, 2025
- 5:00 pm
Home Renovation Loans: ఇంటి రీమోడలింగ్‌కు బ్యాంకు రుణం.. గమనించాల్సిన అంశాలు ఇవే..!
ప్రతి ఒక్కరి జీవితంలో సొంతింటికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఎంతో కష్టబడి, ప్రతి రూపాయికి కూడబెట్టి దాన్ని నిర్మించుకుని ఉంటారు. ఆ ఇంటిలో మీకు ఎన్నో తీపి గుర్తులు ఉంటాయి. పిల్లలు పుట్టడం, పెరగడం, వారి వివాహాలు.. ఇలా అనేక సందర్భాలకు ఇల్లు ప్రత్యక్ష సాక్షి అని చెప్పవచ్చు. అయితే మీరు కట్టుకున్న ఇల్లు కొంత కాలానికి పాతబడిపోతుంది. చుట్టు పక్కల మరిన్ని అందమైన భవనాలు వస్తాయి. దీంతో మీ ఇంటిని పునరుద్ధరించాల్సిన (రీ మోడలింగ్) చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీని కోసం పెట్టుబడిని సమకూర్చుకోవడానికి మీకు ఈ కింద తెలిపిన ఆర్థిక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
- Srinu
- Updated on: Apr 22, 2025
- 4:30 pm