AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ అందం వెనుక ‘వీగన్’ రహస్యం ఇదే! మాంసాహారం వదిలేసి ఏం తింటోందో తెలుసా?

ఆమె ఒక స్టార్ హీరో కూతురు.. బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రతిభావంతురాలు. వయసు నాలుగు పదులకు చేరువవుతున్నా, ఇప్పటికీ కాలేజీ అమ్మాయిలాగే కనిపిస్తుంది. ఆమె అందం వెనుక ఖరీదైన మేకప్ ఉంది అనుకుంటే మీరు పొరబడినట్లే.

Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ అందం వెనుక ‘వీగన్’ రహస్యం ఇదే! మాంసాహారం వదిలేసి ఏం తింటోందో తెలుసా?
Shraddha Kapoorr
Nikhil
|

Updated on: Mar 05, 2026 | 10:31 PM

Share

లోపలి నుండి ఆరోగ్యంగా ఉంటేనే ముఖంలో ఆ మెరుపు వస్తుందని ఆమె నమ్ముతుంది. అందుకే రెండేళ్ల క్రితం ఆమె తన డైట్ లో ఒక విప్లవాత్మక మార్పు చేసుకుంది. తనకెంతో ఇష్టమైన ఆహారాలను పక్కన పెట్టి ఒక కొత్త బాట పట్టింది. బాలీవుడ్ గర్ల్ నెక్స్ట్ డోర్ శ్రద్ధా కపూర్ తన సహజమైన నటనతోనే కాకుండా, తన ఫిట్‌నెస్ మరియు వెలిగిపోయే చర్మంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె జీవనశైలిలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. అదే ఆమె వీగన్ ప్రయాణం.

వీగన్ ప్రయోగానికి శ్రీకారం..

ఒక ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ తాను వీగన్‌గా మారినట్లు వెల్లడించారు. జంతువుల పట్ల ప్రేమ లేదా అథ్లెటిక్ అవసరాల కోసం కాకుండా, కేవలం శారీరకంగా మరింత మెరుగ్గా అనిపించడం కోసమే ఆమె ఈ మార్పును ఎంచుకుంది. “మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం వల్ల నాలో చాలా ఆసక్తికరమైన మార్పు వచ్చింది, ఇది నాకు చాలా మంచి అనుభూతిని ఇస్తోంది” అని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. వీగన్ అంటే కేవలం మాంసం మానేయడం మాత్రమే కాదు, పాలు, గుడ్లు, తేనె వంటి జంతువుల నుండి లభించే ఏ పదార్థాన్ని తీసుకోకపోవడం.

సింపుల్ డైట్ ప్లాన్

ఇంత పెద్ద నటి అయినప్పటికీ, శ్రద్ధా కపూర్ ఆహారం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమెకు మన భారతీయ సాంప్రదాయ వంటకాలైన పప్పు, అన్నం మరియు కూరలు అంటే చాలా ఇష్టం. విశేషమేమిటంటే, ఆమెకు చపాతీలు తినడం అస్సలు నచ్చదు. అప్పుడప్పుడు వెరైటీ కోసం కాంటినెంటల్ లేదా ఏషియన్ వంటకాలను రుచి చూస్తుంటారు. వేయించిన పదార్థాలు, చిప్స్, కూల్ డ్రింక్స్‌కు ఆమె సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారు. ఒకవేళ ఆకలిగా అనిపిస్తే డ్రై ఫ్రూట్స్ ను స్నాక్స్ లా తీసుకుంటారు.

శ్రద్ధా కపూర్ అందం వెనుక ఉన్న మరో పెద్ద సీక్రెట్ ఆమె ‘డిన్నర్’ టైమింగ్స్. సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల లోపే ఆమె తన రాత్రి భోజనాన్ని ముగించేస్తారు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, మంచి నిద్ర పడుతుందని ఆమె చెబుతారు. అలాగే సాయంత్రం 6 గంటల లోపే వర్కవుట్లు పూర్తి చేయడం ఆమె దినచర్యలో భాగం. క్రమశిక్షణతో కూడిన ఈ అలవాట్లే ఆమెను 39 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, యవ్వనంగా ఉంచుతున్నాయి. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని శ్రద్ధా నిరూపిస్తోంది. అయితే ఇటువంటి పెద్ద మార్పులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.

Follow Us