ప్రభాస్
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా ప్రస్తుతం సత్తా చాటుతున్నాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. అప్పటి వరకు మాస్ హీరోగా ఉన్న ప్రభాస్.. బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఆదిపురుష్ మూవీతో హీరోగా తనకున్న ఇమేజ్‌ను 360 డిగ్రీలు మార్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు రెబల్ స్టార్ మూవీస్ బిజినెస్ రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లకు చేరుకుందంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు ప్రభాస్‌ను డార్లింగ్‌గా పిలుచుకుంటారు.
1979 అక్టోబర్ 23న మద్రాసులో జన్మించారు ప్రభాస్. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు వారి కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు ప్రభాస్. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు సినిమాలు టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ రేంజ్‌ను పెంచేశాయి. బిల్లా, ఏక్ నిరంజన్, డార్టింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబెల్, మిర్చి మూవీస్‌తో టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోస్ సరసన నిలిచాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. డిసెంబరు 22న రిలీజ్ కానున్న సాలార్‌తో పాటు ప్రాజెక్ట్ కె, స్పిరిట్ పాన్ ఇండియా మూవీస్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.
కృష్ణంరాజుకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తేలు. దీంతో కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు కుమారుడైన ప్రభాస్.. కృష్ణంరాజు నటవారసుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ అవడానికి సోదరుడి కుమారుడే అయినా.. వీరిద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధమే కొనసాగేది. అంతగా తన నట వారసుడి గురించి కృష్ణంరాజు.. గర్వపడేవారు. ప్రభాస్, కృష్ణంరాజు కలసి రెబల్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఇందులో తండ్రీకొడుకులుగా వారు నటించారు. నిజజీవితంలో కృష్ణంరాజు ప్రభాస్ కు పెదనాన్న కాగా.. ఈ చిత్రంలో మాత్రం.. ఇద్దరూ తండ్రీకొడుకుల్లా చేసిన నటన రెబల్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఒక విజువల్ ఫీస్ట్‌గా నిలిచింది. ఒకానొక సమయంలో ప్రభాస్ అల్టిమేట్ యాక్టింగ్ స్కిల్స్ తో హాలీవుడ్ రేంజ్ కి చేరారని స్వయానా కృష్ణంరాజు ఎంతో గర్వంగా చెప్పుకున్నారు.