Ram Naramaneni
Assistant News Editor, Political, Hyper Local, Trending, Human Interest - TV9 Telugu
ramu.naramaneni@tv9.comతెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2017లో మహా న్యూస్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019 ఫిబ్రవరిలో టీవీ9 తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్‌గా చేరాను. అక్కడే 2022 మార్చి నుంచి చీఫ్ సబ్ ఎడిటర్‌గా, 2024 ఏప్రిల్ నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా, 2025 నవంబర్ నుంచి న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. పొలిటికల్, హైపర్ లోకల్, ఎంటర్టైన్మెంట్, క్రైమ్, వ్యవసాయ సంబంధిత కథనాలు, రైతుల విజయాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కువగా అందిస్తూ ఉంటాను.
Andhra: ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. 34% బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో బీసీ రిజర్వేషన్లపై తదుపరి నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.
- Ram Naramaneni
- Updated on: Oct 9, 2026
- 12:34 pm
క్యాన్సర్ మందుల ధరలకు కళ్లెం.. రోగులకు ఏటా రూ.2,500 కోట్ల ఆదా!
క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్లను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)లో 30 శాతానికి పరిమితం చేయనుంది. ఈ చర్యతో కొన్ని మందుల ధరలు 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉండగా, రోగులకు ఏటా సుమారు రూ.2,500 కోట్ల మేర ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
- Ram Naramaneni
- Updated on: Oct 9, 2026
- 10:06 am
Telangana: ఎల్ నినో ఎఫెక్ట్.. అడుగంటిపోతున్న భూగర్భ జలాలు
తెలంగాణలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, జలాశయాలు నిండకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలమట్టాలు 7.52 మీటర్ల లోతుకు పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతేడాదితో పోలిస్తే 3.11 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గాయి. తక్షణ చర్యలు తీసుకోకుంటే తాగు, సాగునీటి కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Ram Naramaneni
- Updated on: Oct 9, 2026
- 8:02 am
Andhra: దానిమ్మ పంట ఈ రైతు దశను దిశను మార్చేసింది..
అనంతపురం జిల్లా రైతు కాళింగ కృష్ణ, రెండున్నర సంవత్సరాలలో దానిమ్మ సాగులో అద్భుత విజయం సాధించారు. 4 ఎకరాల్లో భగవా రకం దానిమ్మ సాగు చేస్తూ, మొదటి పంటలోనే 30 టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నారు. 20 లక్షల పెట్టుబడిని ఒకే పంటతో తిరిగి పొందుతూ, తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు.
- Ram Naramaneni
- Updated on: Oct 8, 2026
- 3:42 pm
Aggipetti Macha: అగ్గిపెట్టె మచ్చా ఇలా ఎందుకు అయ్యాడో తెలుసా..? మరణానికి అసలు కారణం ఇదే..
తెలుగు యూట్యూబ్, సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టె మచ్చా (కిరణ్ కుమార్) మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించింది. వృత్తి రీత్యా వీడియోగ్రాఫర్ అయిన ఆయన, గతంలో జరిగిన ప్రమాదం, తలకు సోకిన ఇన్ఫెక్షన్, మద్యం అలవాటు కారణంగా ఆరోగ్యం క్షీణించి తిరుపతిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన విలక్షణ శైలితో అనేకమందిని అలరించిన ఆయనకు సోషల్ మీడియాపై అవగాహన లేకపోవడం గమనార్హం.
- Ram Naramaneni
- Updated on: Oct 8, 2026
- 2:58 pm
Andhra: కుల సర్టిఫికెట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. వాట్సాప్‌లోనే పొందండి!
ఏపీ ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రం జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై రెవెన్యూ కార్యాలయాలు, సచివాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- Ram Naramaneni
- Updated on: Oct 8, 2026
- 12:47 pm
Moral Story: దురాశకు పోయిన కాకికి జీవితాంతం బాధ పడే శిక్ష పడింది..
వ్యాపారి వంటగదిలో పావురం ప్రశాంతంగా జీవిస్తుండగా, దురాశతో కూడిన కాకి దానితో స్నేహం చేసి ఆశ్రయం పొందింది. చేపల కోసం కక్కుర్తిపడి, పావురాన్ని మోసగించి, దొంగిలించడానికి ప్రయత్నించిన కాకి వంటవాడి ఆగ్రహానికి గురై రెక్కలు విరిగిపోయి దుఃఖంలో మునిగిపోయింది. ఈ కథ దురాశ దుష్ఫలితాలను స్పష్టం చేస్తుంది.
- Ram Naramaneni
- Updated on: Oct 8, 2026
- 12:08 pm
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది సీతాఫలాలు కూడా తినేటట్టు లేదుగా..
ఎల్‌నినో ప్రభావంతో సీతాఫలం దిగుబడి భారీగా పడిపోయింది. సకాలంలో వర్షాలు లేక, ఉష్ణోగ్రతలు పెరగడంతో పూత దశలోనే పంట దెబ్బతింది. దీంతో రైతులు అధిక పెట్టుబడులు పెట్టినా తగిన లాభాలు పొందలేకపోతున్నారు. మరోవైపు మార్కెట్లోకి సరుకు రాక, ధరలు ఆకాశాన్ని తాకడంతో వినియోగదారులు కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నారు. ఇది రైతుల నుంచి వినియోగదారుడి వరకు అందరిపై ఆర్థిక భారం మోపుతోంది.
- Ram Naramaneni
- Updated on: Oct 8, 2026
- 10:57 am
శాటిలైట్ కమ్యూనికేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. నిబంధనలు అందరికీ సమానమే
శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించిన భారత నియంత్రణ వ్యవస్థ న్యాయబద్ధంగా, వివక్ష రహితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. NGSO ఆధారిత శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు మూడు సంస్థలకు టెలికాం లైసెన్సులు ఇచ్చామని తెలిపింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ..
- Ram Naramaneni
- Updated on: Oct 8, 2026
- 10:41 am
జన్‌పథ్‌లో ఉద్రిక్తత.. రాహుల్, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో విపక్ష కూటమి చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈసీ కార్యాలయానికి మార్చ్‌గా బయల్దేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలను జన్‌పథ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- Ram Naramaneni
- Updated on: Oct 7, 2026
- 6:00 pm
Andhra: కంచెగా పెంచిన మొగలి.. ఇప్పుడు రైతులకు కాసుల పంట!
శ్రీకాకుళం జిల్లాలో మొగలి పూల సాగు రైతుల ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చివేసింది. ఒకప్పుడు కంచె మొక్కగా ఉన్న మొగలి, ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. సుమారు 6,000 హెక్టార్లలో సాగువుతున్న ఈ పూలు, అత్తరు పరిశ్రమలకు ఎగుమతి అవుతున్నాయి. లీటరు మొగలి ద్రావణం రూ.4 లక్షల వరకు పలకడంతో రైతులు భారీగా లబ్ధి పొందుతున్నారు.
- Ram Naramaneni
- Updated on: Oct 7, 2026
- 4:49 pm
సునామీ ఎలా పుడుతుంది? సముద్రంలో కనిపించని అల.. తీరానికి వచ్చేసరికి పెను విధ్వంసం!
సముద్రం ప్రశాంతంగా కనిపించినా.. దాని అడుగున జరిగే భారీ భూకంపం క్షణాల్లో పెను విపత్తును సృష్టించగలదు. సముద్రపు అడుగుభాగం ఒక్కసారిగా పైకి లేదా కిందికి కదిలినప్పుడు భారీ నీటి స్తంభం స్థానభ్రంశం చెంది ఏర్పడే తరంగాల శ్రేణినే సునామీ అంటారు. ..
- Ram Naramaneni
- Updated on: Oct 7, 2026
- 12:43 pm