ఎన్నికలు 2024 ఫలితాల వార్తలు

ముస్లింల కంచుకోటలో అనూహ్య ఫలితం..!

ముస్లింల కంచుకోటలో అనూహ్య ఫలితం..!

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఉద్దవ్ వర్గం అనుమానాలు

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఉద్దవ్ వర్గం అనుమానాలు

ఇంతకీ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు?

ఇంతకీ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు?

మళ్లీ హేమంత్‌ సోరెన్‌కే పట్టం కట్టిన జార్ఖండ్ ఓటర్లు..!

మళ్లీ హేమంత్‌ సోరెన్‌కే పట్టం కట్టిన జార్ఖండ్ ఓటర్లు..!

మహారాష్ట్రలో NDA మహా ప్రభంజనం..!

మహారాష్ట్రలో NDA మహా ప్రభంజనం..!

మహారాష్ట్ర NDA, జార్ఖండ్‌ ఇండియా కూటమి హవా

మహారాష్ట్ర NDA, జార్ఖండ్‌ ఇండియా కూటమి హవా

ఫలితాలు రానేలేదు.. అప్పుడే మొదలైన క్యాంప్‌ పాలిటిక్స్‌!

ఫలితాలు రానేలేదు.. అప్పుడే మొదలైన క్యాంప్‌ పాలిటిక్స్‌!

సీఎం పదవి రేసులో ఆ నలుగురు...!

సీఎం పదవి రేసులో ఆ నలుగురు...!

మహా సమరం.. 3 దశాబ్దాల తర్వాత అత్యధిక పోలింగ్ శాతం నమోదు..

మహా సమరం.. 3 దశాబ్దాల తర్వాత అత్యధిక పోలింగ్ శాతం నమోదు..

ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఎన్డీఏ కూటమిదే పైచేయి!

ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఎన్డీఏ కూటమిదే పైచేయి!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన సెలబ్రిటీలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన సెలబ్రిటీలు

ఎన్నికల వేళ ముంబైలో హైడ్రామా !

ఎన్నికల వేళ ముంబైలో హైడ్రామా !

ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!

ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!

ఇక్కడ అన్నీ డబుల్ ఓటర్లుగా రికార్డ్‌కి ఎక్కబోతున్న ఆ గ్రామస్తులు

ఇక్కడ అన్నీ డబుల్ ఓటర్లుగా రికార్డ్‌కి ఎక్కబోతున్న ఆ గ్రామస్తులు

మహారాష్ట్రలో కేంద్రమంత్రి అమిత్ షా ర్యాలీలు రద్దు..!

మహారాష్ట్రలో కేంద్రమంత్రి అమిత్ షా ర్యాలీలు రద్దు..!

జమ్ము అండ్ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2024

జమ్ము అండ్ కశ్మీర్ అసెంబ్లీకి 18 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసి, రాష్ట్ర హోదాను ఉపసంహరించుకున్న తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీకి చివరగా 2014 నవంబరు – డిసెంబరులో ఎన్నికలు నిర్వహించారు.

కాంగ్రెస్, జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, జమ్ము కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (ఇండియా) ఓ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఆ పార్టీల మధ్య ఐదు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ నెలకొంటోంది. అటు బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంటోంది. జమ్ముకశ్మీర్‌లో అధికార పగ్గాలు చేపట్టేందుకు 46 మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది.

అలాగే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2024 అక్టోబర్ 5 తేదీన జరగనున్నాయి. హర్యానా అసెంబ్లీలోని మొత్తం 90 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. హర్యానాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు 46 మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది. ప్రస్తుత హర్యానా శాసనసభ పదవీకాలం 2024 నవంబరు 3 తేదీతో ముగియనుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి గత ఎన్నికలు 2019 అక్టోబర్‌లో జరిగాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ సర్కారు అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ 2024 మార్చి 12న తన పదవికి రాజీనామా చేయగా.. అదే రోజు నయాబ్ సింగ్ సైనీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(BJP), కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంటోంది. అయితే జననాయక్ జనతా పార్టీ (JJP), ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) పార్టీలు ఓ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలుస్తుండగా… మరో మూడు పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), హర్యానా లోఖిత్ పార్టీ (HLP) మరో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బీజేపీ ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, అగ్నివీర్ పథకం, నిరుద్యోగ సమస్య, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్ల ఆరోపణలు తదితర అంశాలు ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి.