తమిళనాడులోని తిరువారూర్‌లో ఒక పారిశుద్ధ్య కార్మికుడు నిజాయితీని ప్రదర్శించాడు. రోడ్డుపై దొరికిన 20 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలున్న బ్యాగును సంబంధిత యజమాని రాధాకృష్ణన్‌కు తిరిగి అప్పగించాడు. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రాధాకృష్ణన్ ఈ బ్యాగును పోగొట్టుకున్నారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలిచిన ఆ కార్మికుడి చర్య సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.