టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగమ్మాయిలకు అవకాశాలు తక్కువనే నానుడి మారింది. గతంలో అతికొద్ది మంది మాత్రమే రాణించగా, ప్రస్తుతం శ్రీలీల, వైష్ణవి చైతన్య వంటి తారలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. పక్క భాషల హీరోయిన్ల అవసరం తగ్గుతూ, మన స్వదేశీ ప్రతిభకు గుర్తింపు లభిస్తోంది. టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల స్వర్ణయుగం మొదలైందని చెప్పొచ్చు.
తెలుగు ఇండస్ట్రీలో తెలుగుమ్మాయిల టైమ్ మొదలైందా..? అసలు మన ఇండస్ట్రీలో వాళ్ల పొజిషన్ ఏంటి..? అవకాశాలు వస్తున్నాయా.. వచ్చినపుడు వాళ్లు నిలబెట్టుకుంటున్నారా..? పక్క ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకునే అవసరం ఇప్పటికైనా తగ్గుతుందా..? మన బ్యూటీస్ స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తున్నారా..? చూద్దాం ఓసారి.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఛాన్సులు రావు.. వచ్చినా పెద్దగా సక్సెస్ అవ్వరు.. చాలా కాలంగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన పదం ఇది. అప్పుడప్పుడో కలర్స్ స్వాతి, బిందు మాధవి.. ఆ తర్వాత ఈషారెబ్బా, అంజలి లాంటి హీరోయిన్లు తప్ప క్లిక్ అయింది కూడా లేదు. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. వరసగా తెలుగమ్మాయిలే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. శ్రీలీల తెలుగమ్మాయే.. గత మూడేళ్లుగా దాదాపు డజన్ సినిమాలకు పైగానే చేసారు ఈ బ్యూటీ. హిట్టు ప్లాపులతో పనిలేకుండా ఇప్పటికీ శ్రీలీలకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తమిళంలో వరస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఈ భామ. అలాగే వైష్ణవి చైతన్య సైతం బేబీ తర్వాత బిజీ అయ్యారు. ఇక దుల్కర్ ఆకాశంలో ఒకతారతో పరిచయం అవుతున్నారు సాత్విక వీరవల్లి. అనన్య నాగళ్ల, అంజలి, ప్రియాంక జవాల్కర్ లాంటి బ్యూటీస్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాకే పరిమితమైపోయారు. బలగం తర్వాత కావ్య కళ్యాణ్ రామ్ వాట్స్ అప్ నరేష్ అనే సినిమాతో వస్తున్నారు. అన్వేష్ మైఖేల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలాగే మ్యాడ్ ఫేమ్ గౌరీప్రియా చెన్నై లవ్ స్టోరీలో కిరణ్ అబ్బవరంతో నటిస్తున్నారు. మొత్తానికి తెలుగుమ్మాయిలు బాగానే సందడి చేస్తున్నారిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
A. R. Rahman: 30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా ?? లేదా ??
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం..
చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మా
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!

