పొలం పనుల్లో మునిగిపోయిన రైతు.. వెనుక మెల్లగా ఏదో కదులుతున్న శబ్దం.. తిరిగి చూస్తే హడల్!
అనకాపల్లి జిల్లా చీడికాడలో పొలం పనుల్లో నిమగ్నమైన రైతుకు ఊహించని అనుభవం ఎదురైంది. 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అటవీశాఖ అధికారులు, వన్యప్రాణుల సంరక్షణ బృందం సమర్థవంతంగా దాన్ని బంధించి, సురక్షితంగా రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో ఓ రైతుకు భయానక అనుభవం ఎదురైంది. పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా, మెల్లగా వినిపించిన శబ్దం అతనిని ఉలిక్కిపడేలా చేసింది. తిరిగి చూడగా, సుమారు 12 అడుగుల పొడవున్న భారీ గిరినాగు పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. ఈ దృశ్యం చూసి ఆ రైతు ఒక్కసారిగా గుండెలు పట్టుకొని భయంతో పరుగులు తీశాడు. కింగ్ కోబ్రా పేరు వినగానే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది కళ్ళముందే ప్రత్యక్షమైతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ విషయం క్షణాల్లో చుట్టుపక్కల గ్రామాలకు పాకటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడే పరిస్థితి ఏర్పడింది. గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బందితో పాటు తూర్పు వన్యప్రాణుల సంరక్షణ బృందం సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంతో అనుభవం కలిగిన స్నేక్ క్యాచర్‌లు ఎవరికీ ఎలాంటి అపాయం కలగకుండా అత్యంత చాకచక్యంగా ఆ భారీ గిరినాగును బంధించారు. అది సుమారు 12 కిలోల బరువు ఉన్నట్లు గుర్తించారు. అటవీశాఖ అధికారుల సమక్షంలో ఆ గిరినాగును సురక్షితంగా తీసుకెళ్లి జనావాసాలకు దూరంగా ఉన్న దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో విడిచిపెట్టారు. భారీ గిరినాగు సురక్షితంగా అడవిలోకి వెళ్లిపోవడంతో చీడికాడ రైతులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా గిరినాగులు దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే ఉంటాయని, ఆహారం కోసమో లేదా వాతావరణ మార్పుల వల్లే సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైతులకు గుడ్ న్యూస్.. QR కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు!
కొండపైనా ‘ఎల్ నినో’ ఎఫెక్ట్..తిరుమల నీటి కష్టాలు తీరేలా సీఎం మాస్టర్ ప్లాన్!
టోల్ ఫీజు ఎగ్గొట్టాలని చూసారో జాగ్రత్త..!
పొలం పనుల్లో మునిగిపోయిన రైతు.. వెనుక మెల్లగా శబ్దం..
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఘనంగా దీపోత్సవం
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
అనంత్ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స

