Breaking News
  • చైనాతో రగడపై రాజ్​నాథ్​ ప్రకటన: లద్దాఖ్‌లో 1962లో చైనా వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించింది. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు. మొత్తం 90 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ప్రధాని మోదీ లద్దాఖ్‌ వెళ్లి సైనికులను కలిశారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడం లేదు. ఎల్‌ఏసీ విషయంలో రెండుదేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు ఎంతో ప్రయత్నించాం. చైనాతో మేం స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నాం.
  • విజయవాడ: దుర్గ గుడి ఈవో సురేష్ బాబు. అమ్మవారి గుడిలో ఎటువంటి విగ్రహాలు పోవటం జరగలేదు. రికార్డ్స్ పరిశీలించి మూడు రోజుల్లో పూర్తి వివరాలు అందిస్తాము. రికార్డ్స్ పరిశీలించకుండా వెండి రథంలో సింహాలు ఉన్నది, లేనిది ఎలా చెప్పగలము. నేను వచ్చిన తరువాత రథం వాడలేదు. అంతర్వేది ఘటన జరిగింది కాబట్టి ఈటువంటి ఫెక్ న్యూస్ వస్తున్నాయి. రథం రేపు చెక్ చేసి పరిశీలిస్తాము. రికార్స్ పరిశీలించి మూడు సింహాలు ఉన్నవి లేనిది తెలుస్తాం.
  • తిరుమల: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను ఢిల్లీలో కలిసిన టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. నోట్ల రద్దు సమయంలో హుండీలో భక్తులు సమర్పించిన పాత రూ.500‌, రూ.వెయ్యి నోట్ల డిపాజిట్ కు అనుమతించాలని మంత్రిని కోరిన టీటీడీ చైర్మన్. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో నోట్ల రద్దు సమయంలో పాత నోట్లను హుండీలో సమర్పించకుండా నియంత్రించలేకపోయమని తెలిపిన టీటీడీ చైర్మన్. రూ.18కోట్ల విలువైన 1.8లక్షల రూ.వెయ్యినోట్లు, రూ.30.17కోట్లు విలువైన 6.34లక్షల రూ.500 నోట్లను రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని కోరిన టీటీడీ చైర్మన్. టీటీడీ ఎస్పీఎఫ్ విభాగానికి సంబంధించి 2014 నుండి బకాయిపడ్డ రూ.23.78 కోట్ల జీఎస్టీ రద్దు చేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరిన టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.
  • చెన్నై : ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఫై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం. యువత భవిష్యత్తుని ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ప్రశ్నర్థకం గా మారుస్తున్నాయని మద్రాస్ హైకోర్టు ఆవేధన . ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ నడుపుతున్న యాజమాన్యాలను ఈ కేసు లో ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశాలు . తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల యువత ఆత్మహత్య లకు పాల్పడం , వీటికి కారణమైన యాజమాన్యాలపై ఎటువంటి చర్యలు చెప్పటారో ఈ నెల 29 కి వివరణ ఇవ్వాలని ఆదేశాలు . ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ రద్దు చేయాలనీ , వాటికీ మద్దతు గా నిలుస్తున్న క్రికెటర్ కోహ్లీ , నటి తమన్నా ని అరెస్ట్ చేయాలనీ మద్రాస్ హైకోర్టు ని ఆశ్రయించిన న్యాయవాధులు వినోద్, సూర్యప్రకాశం.
  • శాస‌న మండ‌లి... టీఎస్ బిపాస్ చర్చలో మంత్రి కేటీఆర్ : టీఎస్ బిపాస్ ప్రజలకు బ్రహ్మాస్త్రం. 75 గజాలు లోపు అని.. అనుమతులు అవసరం లేదు కదా అని కుతుబ్ మినార్ కడితే ప్రభుత్వం చూస్తూ ఉరుకోదు . అక్టోబర్ మొదటి వారంలో హైకోర్టు లో బీఆర్ఎస్ పై విచారణ ఉంది . బిల్డింగ్ ,లే అవుట్ పర్మిషన్ ల కోసం టిఎస్ బిపాస్ సూపరియర్ చట్టం . ఎన్వోసి బాధ్యత కూడా మున్సిపల్ శాఖదే టీఎస్ బిపాస్ అర్బన్ గవర్నెన్స్ లో విప్లవాత్మకమైన అడుగు . భవన నిర్మాణ అనుమతికి టౌన్ ప్లానింగ్ అధికారుల దయ ...మన ప్రాప్తంకు టీఎస్ బిపాస్ తో చరమ గీతం . బిల్డింగ్ నిర్మాణంకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే...22 వ రోజు అనుమతి వచ్చినట్టే సెల్ఫ్ సర్టిఫికేషన్ లో అప్లై చేసుకున్న స్థలంలో కాకుండా నిర్మాణాలు చేపడితే....నోటీసులు లేకుండా కూల్చివేస్తారు. టీఎస్ బిపాస్ బిల్లు 2020కి శాసన మండలి ఆమోదం.
  • కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం కలిసి పని చేయనున్న సీసీఎంబి , అరబిందో ఫార్మా. కరోనా వైరస్ వ్యక్సీన్ తయారికోసం సీసీఎంబి , ఆరబిందో ఫార్మా సంయుక్తంగా పనిచేయనున్నట్టు ప్రకటించిన సీసీఎంబి. సీఎస్ ఐ ఆర్, ఆరబిందో ఫార్మా మధ్య ఒప్పందం చేసుకున్నట్టు తెలిపిన సీసీఎంబి . వాక్సిన్ డెవలపింగ్ కోసం పనిచేయనున్న మూడు CSIR ల్యాబ్లు. క్లినికల్ డెవలప్మెంట్, కమర్షియలైజేషన్ బాధ్యతలు తీసుకొనున్న అరబిందో ఫార్మా. వ్యాక్సిన్ తయారీ కోసం ప్రైవేట్ సంస్థతో పని చేయనున్న సిసిఎంబి.
Advertise, అడ్వర్టైజ్
Advertise, అడ్వర్టైజ్