AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah Bhatia: ప్రేమకు కొత్త అర్థం చెప్పిన తమన్నా.. మిల్కీ బ్యూటీ కొత్త ఫిలాసఫీ వైరల్

Tamannaah Bhatia: ప్రేమకు కొత్త అర్థం చెప్పిన తమన్నా.. మిల్కీ బ్యూటీ కొత్త ఫిలాసఫీ వైరల్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 18, 2026 | 6:40 PM

Share

విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత ప్రేమ, రిలేషన్‌షిప్స్‌పై తమన్నా చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేమ ఒక్కసారే పుడాల్సిన అవసరం లేదని, నిజమైన ప్రేమ అంటే స్వేచ్ఛ ఇవ్వడమేనని ఆమె చెప్పిన మాటలు కొత్త చర్చకు దారితీశాయి. తమన్నా తాజా కామెంట్లు ఆమె వ్యక్తిగత జీవితానికే సంబంధించిన సంకేతాలంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

బ్రేకప్ తర్వాత తమన్నాలో మార్పు వచ్చిందా..? లవ్, రిలేషన్స్ గురించి మిల్కీ బ్యూటీ ఇస్తున్న కొత్త డెఫినేషన్స్ వెనక ఉద్దేశం ఏంటి..? విజయ్ వర్మతో బ్రేకప్ ఆమెను పూర్తిగా మార్చేసిందా..? ప్రేమంటే స్వేచ్ఛ ఇవ్వాలని, అది ఒక్కసారే కాదు ఎన్నిసార్లైనా పుడుతుందంటూ ఆమె చెబుతున్న మాటల వెనక అంతరార్థమేంటి..? తన బ్రేకప్‌కు అదే రీజన్ అని ఇన్ డైరెక్టుగా హింట్ ఇస్తున్నారా..? విజయ్ వర్మతో బ్రేకప్ అయినప్పటి నుంచి తమన్నా సమయం దొరికిన ప్రతిసారీ ప్రేమ గురించి ఏదో ఒక లెక్చర్ ఇస్తూనే ఉన్నారు. నేటి యువతకు అసలు ప్రేమంటే ఏంటో తెలియదని, రిలేషన్ షిప్స్ విషయంలో వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారంటూ తన తాజా ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేమ ఒక్కసారే పుట్టాల్సిన అవసరం లేదని.. జీవితంలో అది ఎన్నిసార్లైనా పుట్టొచ్చంటూ ఆరెంజ్‌లో రామ్ చరణ్ మాదిరి సరికొత్త అర్థాన్ని చెప్తున్నారు తమన్నా. తమ భావాలను ఇతరులపై బలవంతంగా రుద్దకూడదని.. నిజంగా ప్రేమిస్తే ఎదుటి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ.. బ్రేకప్ తర్వాత ఆమె ఫ్రీడమ్ గురించి గట్టిగానే మాట్లాడుతుండటం కొత్త చర్చకు దారితీస్తుంది. తమన్నా మాటలు వింటుంటే ప్రేమలో తను ఎంత స్వేచ్ఛను కోరుకున్నారో అర్థమవుతోంది.. బహుశా ఇదే విజయ్ వర్మతో విడిపోవడానికి ఈ కారణాలే దారి తీసి ఉంటాయనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. పెళ్లి పీటల వరకు వెళ్లిన ఈ జోడీ.. చివరి నిమిషంలో విడిపోయారు. అయితే ఈ బ్రేకప్ గురించి ఇటు తమన్నా, అటు విజయ్ ఇప్పటి వరకు బయట మాట్లాడింది లేదు. విజయ్ వర్మ, తమన్నా ఎందుకు విడిపోయారన్న కారణాలు చెప్పకపోయినా.. తాజాగా ప్రేమ గురించి తమన్నా మాటలు విన్నాక సీన్ అర్థమైపోతుంది. మొత్తానికి మిల్కీ బ్యూటీ తన బ్రేకప్ స్టోరీని డైరెక్ట్‌గా చెప్పకుండా ఇలా ఫిలాసఫీతో బయటపెడుతున్నారని ఆమె మాటలు వింటుంటే అర్థమైపోతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్

Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే

సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం

కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??

కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

Follow Us