జేసీబీతో నేల చదును చేస్తుండగా వింత శబ్ధాలు.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి!
ఖమ్మం జిల్లాలో జేసీబీతో స్థలం చదును చేస్తుండగా భారీ కొండచిలువ బయటపడింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు భయాందోళనకు గురవగా, ఓ వ్యక్తి కొండచిలువను అదుపులోకి తీసుకుని స్నేక్ క్యాచర్కు అప్పగించాడు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఖమ్మం జిల్లాలో ఓ భారీ కొండచిలువ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ రైతు జేసీబీతో తన స్థలాన్ని చదును చేయిస్తున్నాడు. జేసీబీ సహాయంతో మట్టిని తొలగిస్తుండగా.. ఒక్కసారిగా భారీ కొండచిలువ బయటపడింది. దాని పరిమాణం, లావు చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో పరుగులు తీశారు. కొద్దిసేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ, హడావిడి నెలకొంది. వారిలో ఓ వ్యక్తి వెంటనే అలర్టయి.. ప్రాణాపాయం ఉన్నప్పటికీ ఏమాత్రం బెదరకుండా ధైర్యంగా ముందుకొచ్చాడు. అత్యంత చాకచక్యంగా ఆ కొండచిలువను అదుపులోకి తీసుకుని, ఆటోలో ఎక్కించాడు. ఆ తర్వాత దానిని సురక్షితంగా స్నేక్ క్యాచర్ అప్పగించారు. ఆయన ఆ కొండచిలువను ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా తీసుకు వెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. జేసీబీ పనుల మధ్యలో భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడం, దానిని ఎలాంటి హాని తలపెట్టకుండా చాకచక్యంగా ఆటోలో తరలించడం వంటి దృశ్యాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ప్రకృతి రక్షణ కోసం, వన్యప్రాణుల పట్ల ఇలాంటి మానవతా దృక్పథం చూపడం అభినందనీయం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరకు అందాలకు పర్యాటకులు ఫిదా.. డాన్సులతో అలరించిన గిరిజనులు
వామ్మో.. చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు
సీతాఫలం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ విషయాలు అస్సలు మిస్ అవ్వకండి!
జిమ్లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!
స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సంచులు.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్..
జేసీబీతో నేల చదును చేస్తుండగా వింత శబ్ధాలు.. ఆ తర్వాత
అరకు అందాలకు పర్యాటకులు ఫిదా..
చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు
జిమ్లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!
స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు.. బయటపడిన సంచులు చోడగా!
400 మార్కులకు 397తో భారీ స్కోర్.. టాపర్ బండారం బయటపడింది ఇలా!
పులినే పరుగులు పెట్టించిన మంత్రి... ఆ తర్వాత!

