బంగారం వెండి
బంగారం అనేది బంగారు ఆభరణాలు, నాణేల తయారీకి ఉపయోగించే లోహం. అదేవిధంగా, వెండి కూడా ఒక మెటల్. ఇది వెండి ఆభరణాలు, నాణేలు కాకుండా అనేక రకాల ఉత్పత్తులలో ఉపయోగిస్తుంటారు. వెండి వివిధ రకాల పాత్రలు, పూజా సామాగ్రి, విగ్రహాల తయారీలో ఉపయోగిస్తుంటారు.
వెండి అనేది ఆభరణాలలో ఉపయోగించే లోహం. ఇది కాకుండా, మొబైల్ ఫోన్ల నుండి వివిధ ప్రోడక్ట్‌లలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇక బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. బంగారం ధరల హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, డిమాండ్ ఇలా పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి.
భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం, వెండి కొనుగోలును శుభప్రదంగా భావించే దేశం భారతదేశం. ధంతేరస్, దీపావళి సందర్భంగా కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తుంటారు. ఆ సమయంలో బంగారం షాపులన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు కూడా ప్రపంచ కారకాలపై ఆధారపడి ఉంటాయి. పెట్టుబడి దృక్కోణంలో బంగారం, వెండి పెట్టుబడిదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. 2017 వరకు, చైనా అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉంది. బంగారం దిగుమతిలో భారత్ కూడా పోటీ పడుతుంటుంది.