AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna S

Krishna S

Sub Editor - TV9 Telugu

krishna.satti@tv9.com

నా పేరు సట్టి కృష్ణ.. టీవీ9 తెలుగులో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నాను. నేను 2015లో 6టీవీ ద్వారా మీడియా రంగంలోకి వచ్చాను. గతంలో 6టీవీ, సీవీఆర్ న్యూస్, మోజో టీవీ, V6, మైక్ టీవీ వంటి పలు ఛానళ్లలో పనిచేశాను. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, క్రైమ్ వార్తలు రాస్తాను. అంతేకాకుండా బిజినెస్, లైఫ్‌స్టైల్, టెక్నాలజీ, హ్యూమన్ ఇంట్రెస్ట్, వైరల్ న్యూస్‌లు అందిస్తాను.

Read More
పాములు నిద్రపోతాయా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..

పాములు నిద్రపోతాయా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..

ప్రకృతిలో అత్యంత రహస్యమైన, ప్రమాదకరమైన జీవుల్లో పాములు ఒకటి. అయితే ఇతర జంతువుల్లా కాకుండా పాముల జీవన విధానం చాలా ప్రత్యేకం. పాములకు అసలు కనురెప్పలే ఉండవన్న సంగతి మీకు తెలుసా? మరి కనురెప్పలు మూసుకోకుండా అవి ఎలా నిద్రపోతాయి? కళ్లు తెరిచే కలలు కంటాయా లేక అసలు నిద్రకే దూరంగా ఉంటాయా? పాములను చూసినప్పుడు ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. దానికి సమాధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఉసిరి vs నిమ్మకాయ.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? దేనిలో విటమిన్ సి ఎక్కువ..

ఉసిరి vs నిమ్మకాయ.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? దేనిలో విటమిన్ సి ఎక్కువ..

Amla vs Lemon: వంటింట్లో సులభంగా లభించే సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సంజీవనిలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో దివ్యౌషధాలుగా పేరుగాంచిన ఉసిరి, నిమ్మకాయలలో ఆరోగ్యానికి ఏది అత్యంత శక్తివంతమైనది అనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కొవ్వు కరిగించి బరువు తగ్గించడంలో నిమ్మకాయ ముందా.. చర్మ సౌందర్యం, షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో ఉసిరి తోపా? ఈ రెండింటి పోషక విలువల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ నుంచి టాప్ ఐటీ కంపెనీల సస్పెన్షన్

ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ నుంచి టాప్ ఐటీ కంపెనీల సస్పెన్షన్

అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది. స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న నెపంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలపై వేటు వేసింది. గ్రీన్ కార్డ్ మంజూరు ప్రక్రియలో అత్యంత కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఈ సంస్థలను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Telangana: అటు ఎల్‌నినో.. ఇటు పెరిగిన డిమాండ్.. తెలంగాణలో విద్యుత్ మంటలు..

Telangana: అటు ఎల్‌నినో.. ఇటు పెరిగిన డిమాండ్.. తెలంగాణలో విద్యుత్ మంటలు..

కరెంట్ కొట్లాటలు అనే టాపిక్‌ రాగానే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఠక్కున గుర్తొచ్చేదేంటి.. ఇంకేటి..? బషీర్‌బాగ్ ఫైరింగ్ ఎపిసోడ్. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు రోడ్డెక్కితే పోలీసులు తుపాకులకు పనిచెప్పారు. అప్పటి ప్రభుత్వంపై పడ్డ ఆ తూటా మరక ఇప్పటికీ చెరిగిపోలేదు. తర్వాత రాష్ట్రం విడిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది.. పోయింది. పాతికేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో బషీర్‌బాగ్‌ ఎపిసోడ్‌ను మెమొరీ బ్యాంక్ నుంచి మళ్లీ బైటికి తీశారు. ఈసారి కరెంట్ తీగల సబ్జెక్ట్‌లో ఎఫెన్స్‌ గేమ్ ఆడుతోంది కారు పార్టీ. మ, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డిఫెన్స్ గేమ్ ఏంటి? అనేది తెలుసుకుందాం..

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే..

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే..

ఆరోగ్యానికి మేలు చేస్తుందని రోజూ గుడ్లు తింటున్నారా? అయితే మీరు దేనితో కలిపి తింటున్నారనే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎంతటి బలమైన ఆహారమైనా.. తప్పుడు ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అది శరీరానికి అమృతం బదులు విషంగా మారే ప్రమాదం ఉందని ఆయుర్వేదం, ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ గుడ్లతో కలిపి అస్సలు తినకూడని ఆహారాలేంటో తెలుసుకుందాం..

వాహనదారులకు బిగ్ గుడ్ న్యూస్.. కేవలం 3 వేలతో ఏడాది మొత్తం టోల్ ఫ్రీ..

వాహనదారులకు బిగ్ గుడ్ న్యూస్.. కేవలం 3 వేలతో ఏడాది మొత్తం టోల్ ఫ్రీ..

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. టోల్ ప్లాజా సమీపంలో నివసించే వారి కోసం ఫాస్టాగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రతి నెలా పాస్ రెన్యూవల్ చేసుకోవాల్సిన తిప్పలు లేకుండా.. కేవలం రూ.3,000తో ఏడాది మొత్తం ఎన్నిసార్లైనా టోల్ గేట్ దాటొచ్చని స్పష్టం చేసింది. ఈ కొత్త వార్షిక పాస్ ఎవరికి వర్తిస్తుంది? ఎలా పొందాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Home Loan: హోమ్ లోన్ టెన్షన్ అక్కర్లేదు.. ఈ ట్రిక్స్ తెలిస్తే లక్షల రూపాయలు ఆదా..

Home Loan: హోమ్ లోన్ టెన్షన్ అక్కర్లేదు.. ఈ ట్రిక్స్ తెలిస్తే లక్షల రూపాయలు ఆదా..

సొంత ఇల్లు కట్టుకోవడమే లక్ష్యంగా 20-25 ఏళ్ల కాలపరిమితితో హోమ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే తీసుకున్న అసలు కంటే బ్యాంకుకు కట్టే వడ్డీయే ఎక్కువవుతోందని దిగులు చెందుతున్నారా? ఇక ఆ భయం అక్కర్లేదు.. సరైన ప్లానింగ్ ఉంటే చాలు.. 20 ఏళ్ల రుణాన్ని కేవలం 10 నుంచి 12 ఏళ్లలోనే పూర్తిగా తీర్చివేయడమే కాకుండా ఏకంగా రూ. 10 నుంచి 15 లక్షల వరకు వడ్డీని సులభంగా ఆదా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

మీరు కూడా పెరుగును ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి..

మీరు కూడా పెరుగును ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి..

రోజూ పెరుగు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. పైగా పదే పదే తోడుపెట్టే పని లేకుండా వారాల తరబడి ఫ్రిజ్‌లో దాచేస్తుంటారు. కానీ ఫ్రిజ్‌లో పెట్టినంత మాత్రాన పెరుగు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుందా? అసలు పెరుగు పులిసిపోయిందా లేక విషతుల్యంగా మారి పాడైపోయిందా అనేది ఎలా తెలుసుకోవాలి? ఫ్రిజ్‌లో నిల్వ చేసే పెరుగుపై నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే..

కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీకు తెలియని నిజాలు..

కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీకు తెలియని నిజాలు..

రెండూ ప్రొటీన్ ఇచ్చే పప్పులే.. కానీ పొట్టలోకి వెళ్లాక వీటి ప్రభావం మాత్రం పూర్తిగా వేరు. కొందరికి కందిపప్పు తింటే గ్యాస్ ఇబ్బంది పెడుతుంది, మరికొందరికి పెసరపప్పు త్వరగా ఆకలి వేసేలా చేస్తుంది. మరి బరువు తగ్గాలనుకునే వారికి, నిత్యం జీర్ణ సమస్యలతో సతమతమయ్యే వారికి ఈ రెండింటిలో ఏది అసలైన ఔషధం. పోషకాల లెక్కల్లో ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఛాయిస్ అనేది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. వారికి కూడా తల్లికి వందనం స్కీమ్ వర్తింపు..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. వారికి కూడా తల్లికి వందనం స్కీమ్ వర్తింపు..

ఏపీలో చదువుకునే పిల్లల కుటుంబాలకు ఇది పండగలాంటి వార్త. అర్హత ఉండి కూడా పథకానికి దూరమైన వేలాది మంది విద్యార్థులకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్ తెలిపింది. వారందరినీ లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా రూ.10,208 కోట్ల భారీ నిధులతో రెండో విడత జమకు లైన్ క్లియర్ చేయడమే కాకుండా.. హాస్టల్ విద్యార్థుల డైట్ ఛార్జీలు, గిరిజన బిడ్డలకు ఉచిత ఐఐటీ కోచింగ్‌కు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇంట్లోనే ఇలాచీ మొక్కను ఇలా పెంచండి.. మీకు తెలియని సీక్రెట్ ట్రిక్స్ ఇవే..

ఇంట్లోనే ఇలాచీ మొక్కను ఇలా పెంచండి.. మీకు తెలియని సీక్రెట్ ట్రిక్స్ ఇవే..

వంటింట్లో ఘుమఘుమలాడే సువాసనలైనా, ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలైనా.. మసాలాల రాణి యాలకుల స్థానం ప్రత్యేకం. మార్కెట్‌లో వేల రూపాయలు పలికే ఈ ఖరీదైన మసాలా దినుసును మనం ఇంట్లోనే, అదీ ఓ చిన్న కుండీలో సులభంగా పెంచుకోవచ్చని మీకు తెలుసా? బాల్కనీలో లేదా పెరట్లో పెద్దగా స్థలం లేకపోయినా పచ్చగా కళకళలాడుతూ పంటనిచ్చేలా యాలకుల మొక్కను ఎలా పెంచుకోవాలో ఈ సింపుల్ టిప్స్ ద్వారా తెలుసుకోండి.

Chicken 65: అరెరె చికెన్ 65 పేరు వెనక ఇంత పెద్ద కథ ఉందా.. 99శాతం తెలియని అసలు సీక్రెట్ ఇదే..

Chicken 65: అరెరె చికెన్ 65 పేరు వెనక ఇంత పెద్ద కథ ఉందా.. 99శాతం తెలియని అసలు సీక్రెట్ ఇదే..

రెస్టారెంట్‌కు వెళ్లి నాన్‌వెజ్ మెనూ చూడగానే అందరి కళ్లూ వెతికే మొదటి పేరు చికెన్ 65. ఎర్రటి రంగులో కరకరలాడే చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఘుమఘుమలతో నోరూరించే ఈ స్టార్టర్‌ను ఇష్టపడని నాన్‌వెజ్ లవర్ ఉండరు. కానీ అసలు దీనికి 65 అనే పేరు ఎందుకు వచ్చింది? 65 రోజుల కోడిపిల్లా? లేక 65 ముక్కలా? చికెన్ 65 పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన అసలు కథ ఇదే..