AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో పిల్లలతో జాగ్రత్త! చెమటకాయల టార్చర్, ఎర్రటి పొక్కులు, దురదకు చెక్ పెట్టే చిట్కాలు

శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి మన స్వేద గ్రంథులు చెమటను బయటకు పంపిస్తాయి. అయితే, విపరీతమైన వేడి లేదా తేమ వల్ల ఈ గ్రంథుల ద్వారాలు మూసుకుపోయినప్పుడు, చెమట బయటకు రాలేక చర్మం కింద ఉండిపోతుంది. దీనివల్ల చర్మంపై ఎర్రటి గుల్లలు వస్తాయి. వీటినే 'వేడి దద్దుర్లు' అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా మెడ, వీపు, చంకలు వంటి చెమట పట్టే ప్రాంతాల్లో కనిపిస్తాయి.శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి మన స్వేద గ్రంథులు చెమటను బయటకు పంపిస్తాయి. అయితే, విపరీతమైన వేడి లేదా తేమ వల్ల ఈ గ్రంథుల ద్వారాలు మూసుకుపోయినప్పుడు, చెమట బయటకు రాలేక చర్మం కింద ఉండిపోతుంది. దీనివల్ల చర్మంపై ఎర్రటి గుల్లలు వస్తాయి. వీటినే 'వేడి దద్దుర్లు' అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా మెడ, వీపు, చంకలు వంటి చెమట పట్టే ప్రాంతాల్లో కనిపిస్తాయి.

వేసవిలో పిల్లలతో జాగ్రత్త! చెమటకాయల టార్చర్, ఎర్రటి పొక్కులు, దురదకు చెక్ పెట్టే చిట్కాలు
Heat Rash .jpg
Nikhil
|

Updated on: Mar 14, 2026 | 6:00 AM

Share

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. ఈ మండే ఎండల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఉక్కపోత కూడా విపరీతంగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ వేధించే ప్రధాన సమస్య ‘చెమటకాయలు’. ఇవి చూడటానికి చిన్న ఎర్రటి పొక్కుల్లా ఉన్నా, వీటి వల్ల కలిగే దురద, మంట మాత్రం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉండే పిల్లలు ఈ సమస్యతో తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు. అసలు ఈ చెమటకాయలు ఎందుకు వస్తాయి? వీటిని తగ్గించుకునే మార్గాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

పెద్దలతో పోలిస్తే పిల్లలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వారి చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల చెమటకాయలు వచ్చినప్పుడు విపరీతమైన మంటతో ఏడుస్తుంటారు. దీనివల్ల వారికి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ముఖ్యంగా మోకాళ్ల వెనుక, మోచేతుల లోపల ఇవి ఎక్కువగా బాధిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • దుస్తుల ఎంపిక- వేసవిలో బిగుతుగా ఉండే సింథటిక్ దుస్తులకు దూరంగా ఉండాలి. కేవలం వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించండి. ఇవి చెమటను పీల్చుకుని చర్మానికి గాలి తగిలేలా చేస్తాయి.
  • పరిశుభ్రత- రోజుకు రెండుసార్లు చల్లటి నీటితో స్నానం చేయాలి. బయటి నుంచి రాగానే చెమట పట్టిన ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలి. స్నానం తర్వాత చర్మాన్ని రుద్దకుండా మెత్తని టవల్‌తో అద్దినట్లు తుడుచుకోవాలి.
  • హైడ్రేషన్- నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం లోపలి నుంచి చల్లబడుతుంది. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.
  • చల్లదనంలో ఉండటం- వీలైనంత వరకు ఎండలో తిరగకుండా, ఫ్యాన్ లేదా ఏసీ ఉన్న గదుల్లో ఉండటానికి ప్రయత్నించాలి. చర్మాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.

ఇంటి చిట్కాలతో ఉపశమనం..

  • కాలమైన్ లోషన్ : దురదను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
  • కలబంద : కలబంద జెల్ రాయడం వల్ల చర్మం చల్లబడి మంట తగ్గుతుంది.
  • ఐస్ ప్యాక్ : పొక్కులు ఎక్కువగా ఉన్న చోట ఐస్ ముక్కలతో మెల్లగా రుద్దితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  • గంధపు పేస్ట్ : మంచి గంధం పేస్ట్‌ను పూయడం ద్వారా చర్మంపై దురద తగ్గి చల్లదనం లభిస్తుంది.
  • కీరదోస : ప్రభావిత ప్రాంతాల్లో కీరదోస ముక్కలను ఉంచడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సాధారణంగా ఇవి 2-3 రోజుల్లో తగ్గిపోతాయి. ఒకవేళ పొక్కుల నుంచి చీము రావడం, జ్వరం రావడం లేదా వారం దాటినా తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చెమటకాయలు అనేవి చిన్న సమస్యే అయినా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ఇన్ఫెక్షన్లుగా మారే అవకాశం ఉంది. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తూ ఈ వేసవిలో మీ చర్మాన్ని పదిలంగా కాపాడుకోండి!

Follow Us
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్
నలుగురు స్నేహితుల జలసమాధి!
నలుగురు స్నేహితుల జలసమాధి!