AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyani Priyadarshan: గ్లామర్ డోస్ పెంచేస్తున్న ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్..

టాలీవుడ్‌లో ఇతర భాషలకు చెందిన హీరోయిన్లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా మలయాళం, కన్నడ, తమిళ ఇండస్ట్రీల నుంచి వచ్చే అందాల భామలు తెలుగు ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. వరుసగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్లుగా మారిపోతున్నారు.

Rajeev Rayala
|

Updated on: Nov 22, 2026 | 2:16 PM

Share
టాలీవుడ్‌లో ఇతర భాషలకు చెందిన హీరోయిన్లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా మలయాళం, కన్నడ, తమిళ ఇండస్ట్రీల నుంచి వచ్చే అందాల భామలు తెలుగు ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. వరుసగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్లుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలో మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ కూడా చేరిపోయింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది.

1 / 5
ముఖ్యంగా మలయాళంలో ఆమె నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈ బ్యూటీకి అక్కడ క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన తన లేటెస్ట్ ఫోటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ కళ్యాణి ప్రియదర్శన్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్, సినిమా అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో తన అందం, స్టైలిష్ లుక్‌తో మరోసారి ఆకట్టుకుంది.

2 / 5
దీంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కళ్యాణి ప్రియదర్శన్ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'హలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. కళ్యాణి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'చిత్రలహరి' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

3 / 5
తెలుగులో ఇప్పటివరకు పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల ఆమె నటించిన 'లోకః చాప్టర్ 1: చంద్ర' సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో కళ్యాణి క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా విజయంతో ఆమె కెరీర్‌లో మరో కీలక మలుపు వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కథల్లోనూ తన సత్తా చాటగలనని నిరూపించుకుంది.

4 / 5
దీంతో దర్శకనిర్మాతలు కూడా ఈ బ్యూటీతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కళ్యాణి.. ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకునే ప్రయత్నంలో ఉంది. తెలుగులోనూ మంచి కథ, బలమైన పాత్ర లభిస్తే మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మలయాళ బ్యూటీ తన తదుపరి సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

5 / 5
Follow Us