AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: నా జీవితంపై డాక్యుమెంటరీ ఎందుకు తీయకూడదు.. విమర్శకులకు నయన్ కౌంటర్!

Nayanthara: నా జీవితంపై డాక్యుమెంటరీ ఎందుకు తీయకూడదు.. విమర్శకులకు నయన్ కౌంటర్!

Phani CH
|

Updated on: Nov 21, 2026 | 2:18 PM

Share

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీపై వస్తున్న విమర్శలకు నయనతార ఘాటుగా స్పందించారు. తన జీవితంపై డాక్యుమెంటరీ ఎందుకు తీయకూడదని ప్రశ్నించారు. ఎవరి అండదండలు లేకుండా సినీ పరిశ్రమలో ఎదిగానని, ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ వదులుకోనని స్పష్టం చేశారు. ధనుష్‌తో కాపీరైట్ వివాదం నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ చుట్టూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ‘నానుమ్ రౌదీతాన్’ సినిమాలోని ఒక చిన్న క్లిప్ వాడుకున్నందుకు నటుడు ధనుష్ ఏకంగా రూ. 10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తూ కాపీరైట్ నోటీసులు పంపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే, “అసలు నయనతార జీవితంపై డాక్యుమెంటరీ తీయాల్సిన అవసరం ఏముంది?” అంటూ కొందరు చేసిన విమర్శలపై ఆమె తాజాగా ఘాటుగా స్పందించారు. తన జీవితంపై డాక్యుమెంటరీ ఎందుకు తీయకూడదని నయనతార సూటిగా ప్రశ్నించారు. “నేను మదర్ థెరిసాను కాను, అలాగని స్వాతంత్ర్య సమరయోధురాలిని కూడా కాను. మీరు ఊహించే గొప్ప బిరుదులకు నేను అర్హురాలిని కాకపోవచ్చు. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అత్యంత సాధారణ అమ్మాయిని. కానీ, పురుషాధిక్యం ఎక్కువగా ఉండే ఈ చిత్ర పరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండా ఇంతటి స్థాయికి ఎదిగాను. నేడు నాకు దక్కుతున్న ప్రేమ, గౌరవం ఏ అగ్ర హీరోకూ తీసిపోదు. ఇన్నేళ్లలో ఎవరూ సాధించలేని విజయాన్ని నేను అందుకున్నాను. అలాంటి నా ప్రయాణాన్ని డాక్యుమెంటరీగా రూపొందించడంలో తప్పేముంది?” అంటూ విమర్శకుల నోళ్లు మూయించారు. 42 ఏళ్ల వయసులో నయనతార కేవలం నటిగానే కాకుండా, ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. నేడు ఆమె ఆస్తుల విలువ రూ. 200 కోట్లకు పైమాటే. తన విజయ రహస్యం గురించి మాట్లాడుతూ.. “నేను సినిమాల్లో నటించినా, వ్యాపారం చేసినా వంద శాతం నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఏం జరిగినా సరే నా ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోను” అని నయనతార స్పష్టం చేశారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, నేడు కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిన ఈ లేడీ సూపర్ స్టార్ విజయగాథ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramya Krishnan: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ ఉంది.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ – విలన్‌ మధ్య కొట్లాట.. ఎవ్వరూ తగ్గట్లేగా..

రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. బాలీవుడ్ నటుడి దయనీయ స్థితి

Monalisa Bhosle: చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుందా.. మోనాలిసా ఇప్పుడేం చేస్తోంది

Sudigali Sudheer: సొంత సినిమాను గాలికొదిలేశాడు! సుధీర్ తీరుపై తీవ్ర విమర్శలు

Published on: Nov 21, 2026 02:16 PM
Follow Us