కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంజర్లలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేయలేదన్న కోపంతో ఒక కొడుకు తన సొంత ఇంటికే నిప్పు పెట్టాడు. వరలక్ష్మి అనే మహిళకు ఇద్దరు కుమారులు. కొద్ది నెలల క్రితం ఆమె చిన్న కుమారుడికి వివాహం జరిపించారు. వివాహం అనంతరం చిన్న కొడుకు వేరు కాపురం కూడా ఉంటున్నాడు. అయితే, తన తల్లి తన పెళ్లి చేయకుండా చిన్న తమ్ముడికి వివాహం చేయడంపై పెద్ద కొడుకు సురేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ కోపంతో రగిలిపోయిన సురేంద్ర, తన తల్లి ఇంట్లో లేని సమయం చూసి దారుణానికి ఒడిగట్టాడు. పెట్రోల్ తీసుకువచ్చి ఇంటిపై పోసి నిప్పు పెట్టాడు. క్షణాల్లో మంటలు చెలరేగి ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ, ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పెళ్లి విషయంలో కక్ష పెంచుకున్న సురేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. “తమ్ముడికి పెళ్లి చేసి, నాకు ఎందుకు చేయలేదు? ముందు నాకు కదా చేయాలి” అని ప్రశ్నిస్తూ, కోపంతో రగిలిపోయిన సురేంద్ర ఈ చర్యకు పాల్పడ్డాడు. తల్లి లేని సమయంలో ఇంటికి నిప్పు పెట్టిన సురేంద్ర చర్యపై స్థానికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.