AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో

దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో

Samatha J
|

Updated on: Nov 19, 2026 | 3:45 PM

Share

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్ తుఫాన్ నవంబర్ 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 145 కి.మీ. వేగంతో గాలులు వీచనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి అక్వాన్ తుఫాన్‌గా మారింది. ఇది నవంబర్ 17న తుఫాన్‌గా మారగా, నవంబర్ 19 నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ తుఫాన్ నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు-తుని మధ్య ఆంధ్రప్రదేశ్-యానాం తీరాలను తాకనుంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్టంగా 145 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని ఐఎండీ హెచ్చరించింది. అక్వాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, బాపట్ల, కృష్ణ, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నవంబర్ 19, 20 తేదీల్లో ఏపీ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం నుంచి నెల్లూరు వరకు అత్యంత భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ నవంబర్ 19 నుంచి 21 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించి, అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు నవంబర్ 20 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది.

మరిన్ని వీడియోల కోసం :

గ్లోబల్‌ మార్కెట్‌లో రామాయణ జోరు.. ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

బిగ్ బీకి మరోసారి బిగ్ వార్నింగ్

దుల్కర్ సినిమా మీద అంచనాలు పెంచేసిన బన్నీ… అంతలా ఆ సినిమాలో ఏముంది?

హీరోయిన్లకు అగ్నిపరీక్ష… ఎవరికి కలిసొస్తుంది?

స్పెషల్ సాంగ్స్‌తో సీనియర్స్ సందడి.. కింగ్ కూడా రెడీనా?

Follow Us