గ్లోబల్ మార్కెట్‌లో రామాయణ జోరు.. ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?
రణబీర్ కపూర్, సాయి పల్లవిల రామాయణ పార్ట్-1 2027లో చైనాలో గ్రాండ్‌గా విడుదల కానుంది. దర్శకుడు నితీష్ తివారీ దంగల్ విజయాన్ని దృష్టిలో ఉంచుకొని భారీ వసూళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. హాలీవుడ్ స్థాయి VFX, స్టార్ కాస్ట్‌తో వస్తున్న ఈ చిత్రం చైనా మార్కెట్‌లో భారతీయ సినిమాకు పూర్వ వైభవం తీసుకువస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.
రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ విజువల్ వండర్ పార్ట్-1ను 2027 మొదటి త్రైమాసికంలో చైనాలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్కడి ప్రేక్షకులకు తగ్గట్లుగా భారీ స్క్రీన్ కౌంట్‌తో రికార్డు స్థాయి వసూళ్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.దర్శకుడు నితీష్ తివారీకి చైనా మార్కెట్‌పై మంచి పట్టు ఉంది. గతంలో ఆయన రూపొందించిన దంగల్ సినిమా చైనాలో 1200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. చైనా ప్రేక్షకులు భారతీయ ఎమోషన్స్, సంస్కృతి, విజువల్ గ్రాండియర్‌కు బాగా కనెక్ట్ అవుతారనే నమ్మకంతో రామాయణ టీమ్ ఉంది. దంగల్ దర్శకుడి నుంచి వస్తున్న ఈ చిత్రం అంతకు మించిన వసూళ్లను సాధిస్తుందని ఆశిస్తున్నారు.ఇటీవలి కాలంలో విజయ్ సేతుపతి మహారాజ మినహా మరే భారతీయ సినిమా చైనా బాక్సాఫీస్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో, హాలీవుడ్ రేంజ్ VFX, స్టార్ కాస్ట్‌తో వస్తున్న రామాయణ పార్ట్-1 చైనాలో భారతీయ సినిమాకు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
జేసీబీతో నేల చదును చేస్తుండగా వింత శబ్ధాలు.. ఆ తర్వాత
అరకు అందాలకు పర్యాటకులు ఫిదా..
చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు
జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!
స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు.. బయటపడిన సంచులు చోడగా!
400 మార్కులకు 397తో భారీ స్కోర్.. టాపర్ బండారం బయటపడింది ఇలా!
పులినే పరుగులు పెట్టించిన మంత్రి... ఆ తర్వాత!

