రివైండ్ 2024
ఈ జగత్తులో శాశ్వితమైనది ఏదైనా ఉందీ అంటే.. అది మార్పు ఒక్కటే. క్యాలెండర్‌లో రోజులు, నెలలు మారుతూ.. చివరికి కొత్త క్యాలెండర్ మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నో చేదు, తీపి గుర్తులను విడిచిపెట్టి.. ఇక కాలచక్రంలో కలిసిపోతోంది 2024 సంవత్సరం. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అందరూ రెడీ అయిపోయారు. ఆశల పల్లకి మోసుకొస్తున్న కొత్త సంవత్సరం 2025 వైపు అందరూ వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
2024లో భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన రాజకీయాలు, క్రీడలు, వార్తల సంఘటనలు, చలనచిత్రాలు, నేరాలు, ప్రధాన సంఘటనలను ఒకసారి పరిశీలిద్దాం.