స్వరాష్ట్రం నుంచి అమరావతి దాకా.. ‘మార్పు’ ఒక్కటే శాశ్వతం..! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
గత పాతికేళ్ల కాలంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన రాజకీయ పరిణామాలు చాలా ఉన్నాయ్. అందులో కచ్చితంగా ముందుగా చెప్పుకోవాల్సింది.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం. తెలంగాణ మలి దశ పోరాటంగా మొదలైన ఉద్యమం.. తెలుగు రాష్ట్రాల రూపురేఖలనే మార్చేయగలదని ఆనాడు ఊహించలేదు. కానీ.. పరిస్థితులన్నీ మారిపోయాయి..

సహస్రాబ్ది మొదలై అప్పుడే పాతికేళ్లు గడిచిపోయాయి. ఇప్పటిదాకా కాలాన్ని మనిషి నడిపించాడు. ఇక నుంచి యంత్రాలు నడిపించబోతున్నాయ్. ఐ మీన్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాజకీయాలనైనా సరే.. కృత్రిమ మేథనే నడిపిస్తుందిక. ఆల్రడీ.. పాలిటిక్స్ సోషల్ మీడియా చేతికి వెళ్లిపోయింది. ఎవరెక్కడ ఉండాలో నిర్దేశిస్తోంది. గడిచిన పాతికేళ్లలో మనిషి ఊహకు కూడా అందని మార్పులెన్నో జరిగాయ్. వచ్చే పాతికేళ్లలోనూ మనం ఊహించనిదే జరగొచ్చు. సో, గడిచిన ఈ పావు శతాబ్దపు జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకోవడం మినహా చేసేదేం లేదు. మెయిన్‌గా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని కీలక సంఘటనలు డిటైల్డ్‌గా చెప్పుకుందాం. గత పాతికేళ్ల కాలంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన రాజకీయ పరిణామాలు చాలా ఉన్నాయ్. అందులో కచ్చితంగా ముందుగా చెప్పుకోవాల్సింది.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం. తెలంగాణ మలి దశ పోరాటంగా మొదలైన ఉద్యమం.. తెలుగు రాష్ట్రాల రూపురేఖలనే మార్చేయగలదని ఆనాడు ఊహించలేదు. 2001 ఏప్రిల్ 27న.. ప్రొఫెసర్ జయశంకర్ మేధోపరమైన మద్దతుతో, హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో కేసీఆర్ నినదించిన స్లోగన్.. ‘జై తెలంగాణ’. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది గానీ.. 2000 సంవత్సరం సెప్టెంబర్‌లోనే ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి, కొత్త పార్టీకి బీజం పడింది. ఒక పార్టీ పుట్టుక, ఆ పార్టీ కారణంగా స్వరాష్ట్ర సాధన, అదే పార్టీకి పదేళ్లపాటు అధికారం.. అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే. ఓవైపు తెలంగాణ ఉద్యమం కొనసాగుతుండగానే.. మరోవైపు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో...
