Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్మిక మందన్నా

రష్మిక మందన్నా

రష్మిక మందన్నా.. కన్నడ నాట పుట్టినా నేషనల్ క్రష్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి. 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. మొదటి సినిమాలోనే తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలను గెల్చుకుంది. ఆతర్వాత గీత గవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. ఇందులో తను పోషించిన శ్రీవల్లి పాత్రతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. ఇక వారిసు (తెలుగులో వారసుడు), సుల్తాన్ సినిమాలతో కోలీవుడ్ ఆడియెన్స్‌ను సైతం మెప్పించిందీ ముద్దుగుమ్మ.

పుష్ప సినిమాతో బాలీవుడ్ లో పాగా వేసిన రష్మికకు యానిమల్ రూపంలో మరొక సాలిడ్ హిట్ దొరికింది. ఇందులో ఆమె అభినయం విమర్శకుల ప్రశంసలు పొందింది. సినిమాల సంగతి పక్కన పెడితే రిలేషన్ షిప్ విషయంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తోంది రష్మిక. విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తుంటాయి. ఇక తన ఫస్ట్ సినిమా కిరిక్ పార్టి చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక. ఇద్దరి అభిరుచులు కలవడంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో పెళ్లిపీటలెక్కకుండానే ఇద్దరూ విడిపోయారు.

ఇంకా చదవండి

Rashmika Mandanna: నెక్స్ట్ ఇయర్ కల్లా రష్మిక మరో బిగ్ అచ్చీవ్‌మెంట్‌.. ఏంటది.?

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న గురించి ఇంట్రస్టింగ్ డిస్కషన్‌ జరుగుతోంది. ప్రజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మిక, నెక్స్ట్ ఇయర్ కల్లా మరో బిగ్ అచ్చీవ్‌మెంట్‌ను టార్గెట్ చేస్తుందట. ఏంటా అచ్చీవ్‌మెంట్‌ అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరీ.

Chhaava OTT: బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది! విక్కీ కౌశల్, రష్మికల ‘ఛావా’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'చావా'. ఈ సినిమా థియేటర్లలో విడుదలై సుమారు 50 రోజులు గడుస్తోంది. అయినా ఈ సినిమాకు ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఇదిలా ఉండగానే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యిందీ బ్లాక్ బస్టర్ మూవీ.

Rashmika Mandanna: స్టార్‌ హీరోలకు లక్కీ హీరోయిన్‌గా రష్మిక మందన్నా.. లిస్టు చూశారా ఎంత మంది ఉన్నారో!

రష్మిక మందన్న శనివారం (ఏప్రిల్ 5) తన పుట్టిన రోజు జరుపుకొంటోంది. ఆమెకు అన్ని వైపుల నుంచి శుభాకాంక్షలు వస్తున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రష్మికకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా రష్మికతో స్క్రీన్ షేర్ చేసుకున్న స్టార్ హీరోలెవరో తెలుసుకుందాం రండి.

Rashmika Mandanna: ఎంత క్యూట్‏గా చెప్పింది భయ్యా.. రష్మిక ఫస్ట్ అడిషన్ వీడియో చూశారా.. ?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. తెలుగు, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది. యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సికందర్ సినిమాతో అలరిస్తుంది.

Rashmika Mandanna: ఆ స్పెషల్ ప్లేస్‌లో రష్మిక మందన్నా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు వెళ్లారో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న శనివారం (ఏప్రిల్ 05) తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న రష్మిక ఈసారి తన పుట్టిన వేడుకలను జరుపుకోవడానికి ఓ స్పెషల్ ప్లేస్ ను ఎంచుకుంది. అక్కడకు ఎవరెవరు వెళ్లారో తెలుసా?

Rashmika Mandanna: సల్మాన్-రష్మికల ఏజ్ గ్యాప్.. సికందర్ జోడీపై అమీషా పటేల్ షాకింగ్ కామెంట్స్

సల్మాన్ ఖాన్ సినిమా 'సికందర్' పై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా రష్మిక మందన్న, సల్మాన్ ఖాన్ మధ్య 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని కొందరు నెటిజన్లు అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ స్పందించింది.

Pushpa 3: పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా ! థియేటర్లు దద్దరిల్లిపోతాయ్‌ !

అల్లు అర్జున్ 'పుష్ప 2.. ది రూల్' గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఎండింగ్ లో 'పుష్ప 3' సినిమా కూడా ఉందని హింట్ ఇచ్చారు. దీంతో ఇప్పటికే ఈ క్రేజీ సీక్వెల్ గురించి పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

Rashmika Mandanna: రష్మిక వయసెంతో తెలుసా..? ఏజ్ గురించి నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. పుష్ప 2, యానిమల్, ఛావా సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మొదటిసారి ప్లాప్ వచ్చి చేరింది. అదే సికందర్. వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మికకు ఈ మూవీ బ్రేకులు వేసింది.

Sikandar: సల్మాన్‌కు బిగ్ షాక్.. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్ లో సికిందర్ .. పోలీసులును ఆశ్రయించిన టీమ్

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నాల సినిమా 'సికందర్' కు సూపర్ హిట్ టాక్ వస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. పలు పైరసీ సైట్స్ లో సల్మాన్ సినిమా దర్శనమిచ్చింది. దీంతో ఇది సినిమా కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

Tollywood: బాక్సాఫీస్ క్వీన్ ఆమె.. 4 నెలల్లో 3 సినిమాలు రూ.3000 కోట్లు.. మాములు క్రేజ్ కాదు గురూ.. ఎవరీ హీరోయిన్..?

ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తెలుగుతోపాటు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది. నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.3000 వేల కోట్లు రాబట్టింది.