స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చాయి. ఈ చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదని, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రభాస్ అభిమానులను ఆకట్టుకునే మాస్ అంశాలు, పంచ్ డైలాగులు పుష్కలంగా ఉంటాయని మేకర్స్ వెల్లడించారు. షూటింగ్ బ్రేక్ ఉన్నా, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ప్రభాస్ లైనప్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పిరిట్. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ తర్వాత విరామం తీసుకున్న మేకర్స్, త్వరలో తదుపరి షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. ఈ సమయంలో స్పిరిట్ కథాంశానికి సంబంధించిన వార్తలు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. ది రాజా సాబ్ సినిమాతో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో స్పిరిట్ చిత్రాలు చేస్తున్నారు. ఫౌజీ ఒక రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. స్పిరిట్ కంటెంట్ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొదట యానిమల్ తరహాలో హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ప్రచారం జరిగినా, తాజా అప్‌డేట్స్ కథ విషయంలో కొత్త కోణాలను ఆవిష్కరించాయి.
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

