నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో ఉన్న ఈ మూవీ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.