డేంజర్ గురూ.. ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

Samatha

06 march 2026

పుచ్చకాయ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కువగా పుచ్చకాయ తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు.

పుచ్చకాయ

ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా  ఉంటాయి. అంతే కాకుండా వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అందుకే సమ్మర్‌లో ఎక్కువ మంది పుచ్చకాయను తింటుంటారు.

పోషకాలు

అయితే పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనిని ఫ్రిజ్‌లో పెట్టి తినడం వలన అనేక సమస్యలు వస్తాయంట. కాగా, ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తినడవ వలన కలిగే అనారోగ్య సమస్యలు ఏవో ఇప్పుడు చూద్దాం

ఫ్రిజ్‌‌లో పెట్టిన పుచ్చకాయ

ఫ్రిజ్‌లో పుచ్చకాయను పెట్టడం వలన దానిపై బ్యాక్టీరియా పేరుకపోతుంది. అంతే కాకుండా, పోషకాలు కూడా తగ్గిపోయి, ఇది శరీరంలో అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందంట.

బ్యాక్టీరియా

ముఖ్యంగా ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తినడవ వలన ఇది గొంతు నొప్పి, అజీర్ణం, కడుపు నొప్పి, కడుపులో మంట, దగ్గు, వంటి సమస్యలకు కారణం అవుతుంది.

గొంతు నొప్పి, అజీర్ణం

అలాగే కొంత మందికి ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తినడం వలన విరేచనాలు, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

వాంతులు

ఫ్రిజ్‌‌లో పెట్టిన పుచ్చకాయను తినడం వలన చిన్నపిల్లలో శ్వాస కోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గొంతు ఇన్ఫెక్షన్ సమస్య వేధిస్తుంది.

శ్వాసకోశ సమస్యలు

అలాగే ఎక్కువ రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్ఛకాయ తినడం వలన ఇందులో ఉన్న పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్స్ పూర్తిగా తగ్గిపోతాయంట.

పోషక విలువలు