శివ శివా.. శివరాత్రికి చలి నిజంగానే పారిపోతుందా..?

Samatha

13 February 2026

శివ రాత్రి వచ్చేస్తోంది. హిందువుల ఈ పండుగను ఎంతో నిష్టగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ రోజు ఉపవాసం, జాగరణ చేస్తూ శివ నామస్మరణ చేస్తుంటారు.

శివరాత్రి

ఇక శివరాత్రి వచ్చిందంటే చాలు చాలా మంది చలి దగ్గుతుంది అంటారు. ముఖ్యంగా అమ్మమ్మ తాతలు, శివరాత్రికి చలి శివ శివా.. అనుకుంటూ వెళ్లి పోతుందని చెబుతుంటారు.

చలి

మరి నిజంగానే శివరాత్రికి చలి వెళ్లి పోతుందా. దీని వెనుక నిజం ఎంత ఉంది? అసలు ఈ విషయం గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

చలి తగ్గడం

మహా శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి సమయంలో వస్తుంది. ముఖ్యంగా ఈ సమయం వాతావరణంలో మార్పులను తీసుకొస్తుంది.

బహుళ చతుర్దశి

శీతాకాలంలో చివరలో పండుగ రావడం వలన ఈ సమయంలో చలి తగ్గి, వేసవి కాలం అప్పుడే, వెచ్చటి గాలులతో ప్రారంభం అవుతుంది.

వేసవి కాలం ప్రారంభం

అందుకే చాలా మంది మాఘ బహుళ చతుర్ధి సమయంలో వచ్చే చలి శివ శివ అటూ వెళ్లి పోతుందని చెబుతుంటారు. అంతే కాకుండా ఈరోజు  శివ నామస్మరణ చేస్తుంటారు.

చలి .. శివ శివ

రాత్రంతా జాగరణ చేస్తూ శివ నామ స్మరణ చేయడం వలన పాపాలు ఎలా పోతాయో చలి కూడా అలానే మాయం అవుతుందంటారు. అంతే కాకుండా, రాత్రి అంత చలిలో జాగరణ చేసి, చలిని జయించి, వాతావరణంలో మార్పులను స్వాగతించడం దీనిని సూచిస్తుంది.

చలి .. శివ శివ

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపినది.వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

గమనిక