బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలివే.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Samatha
31 January 2026
ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. చాలా మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇది పంజా విసురుతోంది.
క్యాన్సర్
ఇక క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యా్న్సర్, పెద్ద పేగు క్యాన్సర్ ఇలా క్యాన్సర్ అనేక రకాలు ఉన్నాయి. కాగా, ఇప్పుడు మనం బ్లడ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం.
క్యాన్సర్ రకాలు
బ్లడ్ క్యాన్సర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దీని వలన కలిగే సమస్యలు ఏవి? దీనిని ఎలా గుర్తించాలో వివరంగా తెలుసుకుందాం.
బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు
బ్లడ్ క్యాన్సర్ అనేది తెల్ల రక్తకణాల అసాధారణ ఉత్పత్తి వలన వస్తుందంట. ఇది ఎక్కువగా ఎముక మజ్జలని ప్రభావితం చేస్తుంది. దీని ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయంటే?
తెల్లరక్తకణాలు
బ్లడ్ క్యాన్సర్ లుకేమియా, లింపోమా, మైలోమాలా ఉంటుంది. ఇందులో దాని దాని రకాన్ని బట్టి, లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారిలో ఎక్కువగా అలసట ఉంటుంది.
రకాన్ని బట్టి లక్షణాలు
ఆకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణం అని చెప్పవచ్చు. ఏకారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి మందగించడం బ్లడ్ క్యాన్సర్ ప్రథమ లక్షణం.
బరువు తగ్గడం
అదే విధంగా విపరీతమైన జ్వరం, తరచూ ఇన్ఫెక్షన్స్ బారినపడటం, తెల్లరక్త కణాలు సరిగా పని చేయకపోవడం వలంటి లక్షణాలు కూడా కారణం కావచ్చు.
బరువు తగ్గడం
చిగుళ్ళ నుండి రక్తస్రావం, ముక్కు నుండి రక్తం కారడం, చర్మంపై చిన్న ఎర్రటి మచ్చలు, రాత్రి సమయంలో అధిక చెమట, బలహీనపడటం, ఏపని చేయలేకపోవడం బ్లడ్ క్యాన్సర్ లక్షణం