పసుపు నీటితో ఆరోగ్యం.. రోజూ తాగితే ఆ సమస్యలకు చెక్!

Samatha

27 January 2026

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ప్రతి వంటల్లో పసుపు అనేది తప్పనిసరి అయిపోయింది.

పసుపు

ఇక కొంత మంది పసుపును వంటల్లో వేసుకొని తీసుకుంటే మరికొంత మంది మాత్రం దీనిని పాలల్లో వేసుకొని తాగుతుంటారు. కొందరు నీటిలో వేసుకొని తాగుతారు.

పాల్లో పసుపు

కాగా, ఇప్పుడు మనం పసుపు నీటిలో వేసుకొని, పసుపు నీరు తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రయోజనాలు

పసుపు నీరు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పసుపులో కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

పోషకాలు పుష్కలం

అందువలన ఎవరు అయితే ప్రతి రోజూ క్రమం తప్పకుండా పసుపు నీరు తాగుతారో, వారిలో రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. పసుపులో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది బెస్ట్ అని చెప్పాలి.

రక్తహీనత

పసుపు నీరు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ పసుపు నీళ్లు తాగడం వలన ఇందులో ఉండే పొటాషియం, గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది.

గుండె ఆరోగ్యం

పసుపు నీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఎవరు అయితే కండరాల నొప్పులు, కండరాల బలహీనతతో బాధపడుతున్నారో వారికి ఇది బెస్ట్ అని చెప్పాలి.

కండరాల నొప్పులు

ప్రతి రోజూ క్రమం తప్పకుండా పసుపు నీరు తాగడం వలన ఇది కండరాలను బలపరచి, రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. ఆరోగ్యానికి మంచిది.

రోగనిరోధక శక్తి