ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి యువత ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంది.
తెల్ల జుట్టు
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు తెల్ల జుట్టుకు గల కారణాలు ఏవి? చిన్నవయసులోనే తెల్ల జుట్టు ఎందుకు వస్తుందో, దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
తెల్ల జుట్టు కారణాలు
చిన్న వయసులో జుట్టు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయంట. ముఖ్యంగా తీసుకునే ఆహారమే దీనికి అతిపెద్ద కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
తీసుకునే ఆహారం
ఉప్పు అతిగా తీసుకోవడం వలన కూడా ఇది తెల్ల జుట్టు పై ప్రభావం చూపుతుందంట. దీని వలన చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుందంట.
ఉఫ్పు తీసుకోవడం
అలాగే అతిగా చ్కక్కెరతో తయారు చేసిన ఫుడ్ తినడం కూడా తెల్ల జుట్టు వస్తుందంట. అంతే కాకుండా ఇది ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
చక్కెర
టీ, కాఫీలు అతిగా తీసుకోవడం వలన కూడా శరీరంలో కెఫిన్ పేరుకపోయి, శరీరం పోషకాలను గ్రహించక, చాలా త్వరగా నల్లటి కురులు తెల్లగా మారిపోతాయంట.
టీ, కాఫీలు
ప్యాక్ చేసిన ఆహారాలు కూడా తెల్ల జుట్టుకు కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే అస్సలే ప్యాక్ చేసిన ఆహారాలు తినకూడదంటున్నారు నిపుణులు.
ప్యాకింగ్ ఫుడ్
ఎవరు అయితే చిన్న వయసులోనే అతిగా మద్యం సేవిస్తారో వారు కూడా తెల్ల జుట్టుతో బాధపడాల్సిన పరిస్థితి వస్తుందంట. అధిక మద్యం కూడా తెల్ల జుట్టుకు కారణం అవుతుందంట.