మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
Samatha
20 January 2026
ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర ప్రారంభం అయ్యింది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు మేడారం బాట పట్టారు.
గిరిజన జాతర
వీర వనితలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం కోసం పట్నం నుంచి ములుగు జిల్లా తాడ్వాయి మండలం, మేడారం గ్రామానికి పయనం అయ్యారు.
ములుగు జిల్లా
అయితే మీరు కూడా హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే వెళితే ఎంత ఛార్జ్ అవుతుందో ఇప్పుడు చూసెయ్యండి.
హైదరాబాద్ టు మేడారం
హైదరాబాద్ నుంచి మేడారం వరకు ప్రయాణం దాదాపు 240 కి,మీ పడుతుంది. అయితే ట్రాఫిక్, రోడ్డు మార్గాన్ని బట్టి దాదాపు నాలుగు నుంచి ఆరు గంటల జర్నీ ఉంటుందంట.
240 గంటల జర్నీ
అయితే దూరం, వ్యవధిని బట్టి ఎందులో వెళితే ఎంత ఖర్చు అవుతుంది. మేడారం వెళ్లడానికి బెస్ట్ ఆప్షన్ ఏదో ఇప్పుడు చూసెయ్యండి.
దూరం, వ్యవధిని బట్టి ఛార్జెస్
కారు లేదా టాక్సీ అయితే ..243 కిమీ 4 గంటలు. దీనికి రూ. 4000ల నుంచి 6000లవరకు అవుతుంది. అలాగే కారు రకాన్ని బట్టి ధరలు ఉండే ఛాన్స్ ఉంది.
కారు
బస్సు, టీఎస్ ఆర్టీ లేదా ప్రైవేట్ బస్సు ఏదైనా సరే, 238 కి,మీ ఆరుగటల జర్నీ దీని కోసం రూ.416 నుంచి 1100ల వరకు అవుతుంది. ఇది మీరు ఎక్కిన బస్సును బట్టి ఉంటుంది.
బస్సు ప్రయాణం
రైలులో మీరు మేడారం వెళ్లాలి అనుకుంటే, మూడు గంటలన్నర పడుతుంది. వరంగల్ వరకు రైలులో వెళ్లాలి అక్కడి నుంచి బస్సులు, టాక్సీలు, ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో వెళ్లొచ్చు.