కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?

Samatha

14 January 2026

తెలుగు రాష్ట్రాల్లో కనుమ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రతి ప్లలెల్లో పట్నంలో  హరిదాసుల కీర్తనలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులతో సందడి నెలకొంది.

తెలుగు రాష్ట్రాలు

ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ. ఈ మూడు రోజులు కూడా చాలా ప్రత్యేకమైనవే.

కనుమ పండుగ

చివరగా కనుమ పండుగ జరుపుకుంటారు, ఈరోజు పశువులకు ప్రత్యేక పూజలు చేసి, వాటికి ఆహారం పెడతారు అంతే కాకుండా ఆరోజు వాటికి పూర్తి విశ్రాంతిని ఇస్తారు.

పశువుల పూజ

అయితే కనుమ పండుగ రోజు కాకి కూడా చెట్టు కదలదు, ఈ రోజు అస్సలే ప్రయాణాలు చేయకూడదు అంటారు పెద్దవారు. కాగా, దీనికి గల కారణాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

కాకి

కనుమ రోజు ప్రయాణాలు చేయడం వలన ప్రయాణాల్లో సమస్యలు , ఆటంకాలు ఏర్పడుతాయి. కనుమ రోజు ప్రయాణం చేయడం కీడు లాంటిది అని అంటుంటారు.

ప్రయాణం

కానీ దీనిపై ఎలాంటి  శాస్త్రీయ నిరూపణ లేదు. అయితే  ఆకాలంలో ఎక్కడికి ప్రయాణం చేయాలి అన్నా ఎడ్ల బండ్లే ఉండేవి, కానీ కనుమ రోజు వాటికి విశ్రాంతిని ఇవ్వాలి కాబట్టి, కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అనే నియమం పెట్టాంటారు కొందరు.

ఎడ్లబండ్లు

అలాగేఈ రోజు  ప్రతి ఒక్కరూ మాంసాహారం తింటారు, గ్రామ దేవతలను పూజించడం, జంతు బలలు ఇవ్వడం చేస్తారు. అంతే కాకుండా ఈరోజు కుటుంబం మొత్తం  కలసి భోజనం చేసి సంతోషంగా గడుపుతారు.

మాంసాహారం

అందువల్లనే, కుటుంబం మొత్తం కలిసి ఉండాలని, భోజనం చేయాలని ప్రయాణాలు నిషేదించారంటారు కొందరు.అలాగే మూడు రోజులు కుటుంబం మొత్తం కలిసి జరుపుకోవాలని కూడా వారు ఈ నియమం పెట్టారంట.

కుటుంబం