మౌనీ అమాస్య వచ్చేస్తుంది. జనవరి 29న మౌనీ అమావాస్య. అయితే ఈరోజు కొన్ని పనులు చేయడం చాలా మంచిదంట.
మౌనీ అమావాస్య
ప్రతి నెల అమావాస్య వస్తుంది. అయితే అన్ని అమావాస్యల్లో కెళ్లా, మౌనీ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అందువలన ఈరోజు కొన్ని పనులు చేయడం చాలా మంచిదంట.
చాలా ప్రత్యేకత
ఈ రోజున ఉపవాసం ఉంటూ, మౌన వ్రతం పాటించడం, అలాగే కొన్ని వస్తువులను దానం చేయడం వలన లక్కు కలిసి వస్తుందంట. ముఖ్యంగా నేడు ఒక్క పని చేయడం వలన మీ జన్మ ధన్యమే అవుతుందంట.
ఉపవాసం
మాఘ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే మౌనీ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. దీని మాఘి అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈరోజు పితృతర్ఫణాలు చేయడం చాలా మంచిదంట.
మాఘ అమావాస్య
మౌనీ అమావాస్య రోజున ఎవరు అయితే పితృదేవతలను ఆరాధించి, వారికి తర్పణం చేసి, వారి పేరు మీద దాన ధర్మాలు చేస్తారో వారికి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందంట.
ధాన ధర్మాలు
దీని వలన వీరికి పితృదోషం నుంచి విముక్తి కలగడమే కాకుండా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల కలిసి వస్తుందంట. ప్రతి పనిలో విజయం వరిస్తుందంట.
పితృదోషం
ముఖ్యంగా మౌనీ అమావాస్య రోజున నది స్నానం చేయడం చాలా మంచిది. ఎవరు అయితే మౌనీ అమావాస్య రోజున నది స్నానం ఆచరిస్తారో వారికి సకల పాపాలు తొలిగిపోతాయంట.
నది స్నానం
అలాగే, ఈ రోజున దాన ధర్మాలు చేయడం, ముఖ్యంగా నువ్వులు, వస్త్రాలు, దుప్పట్లు, ఆహారం దానం చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట.