కల్లు ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లెటూర్లలో చాలా మంది కల్లును ఇష్టంగా తాగుతుంటారు. ఎందుకంటే దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఆరోగ్యానికి మంచిది
ఇక కొంత మంది రోజూ కల్లు తాగడానికి ఇంట్రస్ట్ చూపుతే కొంత మంది మాత్రం కేవలం పండుగ సమయంలో మాత్రమే కల్లు తాగుతుంటారు.
ఆరోగ్యానికి మేలు చేస్తుంది
ప్రస్తుతం సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ సమయంలో పట్టణంలోని వారందరూ పల్లెల్లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తారు, కొందరు విందు, దావత్‌లు చేసుకుంటూ కల్లు తాగుతుంటారు.
పండగుకు ఇష్టంగా
అయితే కల్లులో తాటి కల్లు, ఈత కల్లు రెండు రకాలు ఉంటాయి. కాగా, ఇందులో దేనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి? పండక్కి ఊరెళ్లేవారు ఏది తాగడం మంచిదో చూద్దాం.
తాటి కల్లు వర్సెస్ ఈత కల్లు
ఈత చెట్టు నుంచి సేకరించే కల్లును ఈత కల్లు అంటారు. ఇది తీపిగా, చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దీనిన ఉదయం వేళల్లో తాగడం వలన శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఈత కల్లు
ఎందుకంటే? ఈత కల్లులో కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందువలన వీటిని తాగడం వలన ఇవి రక్తహీనతను తగ్గిం,జీర్ణక్రియకు చాలా మంచిది. శరీరానికి శక్తినిస్తుంది.
రక్తహీన తగ్గిస్తుంది
తాటి చెట్టు నుంచి సేకరించేది తాటి కల్లు, ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తాగడం వలన రోగనిరోధక శక్తిపెరగడమే కాకుండా, ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
తాటి కల్లు
ఇక ఈ రెండింటిలో ఏదీ తాగడం మంచిదంటే? ఈత కల్లు తీపిగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా చూస్తే ఈత కల్లు కంటే కొంచెం తాటి కళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.