చేప తల తినడం ఇష్టం లేదా.. ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే!

Samatha

7 January 2026

చేపల కర్రీ, చేపల పులుసు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా చేపలను తింటారు.

చేపల కర్రీ 

కొందరు చికెన్, మటన్ తింటే కొంత మంది కేవలం ఫిష్ తినడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. ఇక చేపలలో అనేక రకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

చికెన్, మటన్

అయితే కొంత మది చేపల తినడానికి అస్సలే ఇంట్రస్ట్ చూపరు. కానీ చేపల తల తినడం వలన అనేక లాభాలు  ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవి అంటే?

ఆరోగ్య ప్రయోజనాలు

చేప తలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలు

అదే విధంగా చేపల తలలో ఉండే చిన్న చిన్న ఎముకలలో కాల్షియం పుష్కలంగా ఉంటుందంట. అందువలన ఇది ఎముకల బలానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.

కాల్సియం

చేపల తలలో కొలాజన్ పుష్కలంగా ఉండటం వలన ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వలన వృద్ధ్యాప్య ఛాయలను తగ్గించి, యవ్వనంగా ఉంచుతుంది.

చర్మ ఆరోగ్యం

రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా చేప తల కీలక పాత్ర పోషిస్తుది. ఇందులో ఉండే విటమిన్స్, రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

రోగనిరోధక శక్తి

అలాగే చేపల తలలో విటమిన్ డి, విటమిన్ బి12 కూడా ఎక్కువగా ఉండటం వలన ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరిచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది.

శరీరానికి తక్షణ శక్తి