డబ్బు బాబోయ్ డబ్బు.. మనీ గురించి తెలుసుకోండి ఈ సీక్రెట్స్!
Samatha
7 January 2026
డబ్బు తెలియని వారు ఎవరూ ఉండరు, ప్రతి అవసరానికి డబ్బే అవసరం, అలాగే నలుగురిలో గౌరవంగా ఉండాలి అన్నా కూడా డబ్బు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే.
డబ్బు
అయితే చాలా మంది డబ్బు అంటే కేవలం కాగితం మాత్రమే అనుకుంటారు. కానీ డబ్బు గురించి తెలియని చాలా విషయాలు ఉన్నాయంట. వాటిని తెలుసుకుందాం.
కాగితం
చాలా మంది చేతిలోకి డబ్బులు రాగానే వాటిని ఆనందంగా తీసుకుంటారు, కానీ అది చేతులు మారినప్పుడు అనేక సూక్షక్రిములు ఉంటాయంట. అది అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
బ్యాక్టీరియా
పూర్వకాలంలో డబ్బు నాణేల రూపంలో ఉపయోగించే వారు. కానీ చైనా ప్రపంచంలోనే మొదటి సారి కాగితపు డబ్బును ఉపయోగించింది.
నాణేలు
చాలా మంది మనం ఉపయోగించే మనీ, నోట్లను కాగితంతో తయారు చేస్తారు అనుకుంటారు. కానీ ఇది తయారు చేయడానికి, పత్తి బాల్సమ్ మిశ్రమం ఉపయోగిస్తారంట.
పత్తి, బాల్సమ్ మిశ్రమం
ప్రపంచంలో చాలా వరకు డబ్బు అంకెల రూపంలో బ్యాంకుల్లోనే ఉన్నదంట. కేవలం 8 శాతం కరెన్సీ మాత్రమే నోట్ల రూపంలో, నాణేల రూపంలో చలామణీ అవుతుందంట.
8 శాతం కరెన్సీ
కొన్ని సార్లు నాణేలను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు అనేది దానిని విలువ కంటే ఎక్కువగా ఉంటుందంట. ఉదాహరణకు, రూపాయి ఉత్పత్తి చేయడానికి రెండు రూపాయలు ఖర్చు అవ్వడం.
నాణెం కంటే ఖర్చు విలువ ఎక్కువ
క్రెడిట్ కార్డు అనేది, ఫ్రాంక్ మెక్ నమారా ఒకసారి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు తన పర్సు మర్చిపోయి హోటల్‌కి వెళ్లాడంట, అప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితులు క్రెడిట్ కార్డు ఆలోచనకు కారణం అయ్యాయంట.