పొట్టు తీయాలా? తీయకూడదా?.. పల్లీలు ఎలా తినడం మంచిదో తెలుసా?
Samatha
16 January 2026
పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది వీటిని స్నాక్స్‌గా ఎక్కువగా తింటుంటారు. అంతే కాకుండా వివిధ వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు.
ఆరోగ్యానికి మంచిది
వీటిలో ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్స్, ఫాలీఫెనాల్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి తినడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఇష్టంగా తింటారు.
యాంటీ ఆక్సిడెంట్స్
అయితే వేరుశనగలు తినే క్రమంలో చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. వీటిని పొట్టు తీసి, పొట్టుతో ఎలా తినడం మంచిదో అనే అనుమానం ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.
ఎలా తినడం
కొంత మంది అయితే ఎర్రటి పొట్టుతో తినడం వలన కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని, పొట్టుతో తింటే కడుపు బరువుగా ఉంటుందని అంటుంటారు.
పొట్టుతో తినడం
కానీ పొట్టుతో తినడమే ఆరోగ్యానికి చాలా మంచిదంట. వేరుశనగ పొట్టులోనే అనేక పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆరోగ్యానకి మంచిది
వేరు శనగ పొట్టు తినడం వలన ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం, వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జీర్ణసమస్యలు
అలాగే, పొట్టులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ , ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండటం వలన ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాలను రక్షిస్తాయి.
కణాల సంరక్షణ
అందుకే పల్లీలను పొట్టు లేకుండా కాకుండా పొట్టుతో తినడం వల్లనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.