పూజలో మిగిలిన పూలను పారేస్తున్నారా.. వీటితో అద్భుత ప్రయోజనాలు

Samatha

24 January 2026

ప్రతి ఒక్కరూ పూజ కోసం పూలను ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని పువ్వులు మిగిలిపోతే వాటిని చెత్త బుట్టలో పారవేయడం ఎవరికీ ఇష్టం ఉండదు.

పూజకు పూలు

దీంతో చాలా మంది మిగిలిపోయిన పూలను ఎలా ఉపయోగించాలా అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే అలాంటి వారికోసమే ఈ సమాచారం. మిగిలిపోయిన పూలను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

మిగిలిన పూలు

మిగిలిన పూలను కంపోస్టింగ్ బిన్ లో వేసి వాటిని ఉపయోగించి, ఇతర మొక్కలకు ఉపయోగించడం వలన వాటిలోని పోషకాలు ఇతర మొక్కలకు అందుతాయి.

మొక్కలు

అలాగే మిగిలిన పూలను, వాటి రేకులను వేరు చేసి, ఎండలో ఎండ బెట్టి మంచి సువాసన గనుక వస్తున్నట్లు అయితే వాటి ద్వారా మూలికలు, సువాసనిచ్చే దూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు.

దూప్ స్టిక్స్

అంతే కాకుండా మిగిలిన బంతి, గులాబీ, మందార రంగులను ఉపయిగించి వాటి నుంచి మీరు సహజమైన రంగులను తయారు చేసుకొని మీ వస్త్రాలకు కొత్త రంగు ఇవ్వవచ్చు.

రంగులు

మిగిలిన పూలు చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా గులాబీ రేకుల ద్వారా రోజ్ వాటర్ తయారు చేసుకోవచ్చును,  ఇది చర్మానికి సహజ మెరుపు ఇస్తుంది.

చర్మ సౌందర్యం

మిగిలిన పూల రేకులతో తక్కువ ఖర్చుతో కూడిన ఆర్ట్ క్రాప్టింగ్ చేయవచ్చును, అలాగే వీటి రేకులపై డ్రాయింగ్ చేసి, కొన్ని రోజుల పాటు పుస్తకాల్లో దాస్తే అవి బెస్ట్  గిప్ట్ ఆర్ట్ గా మారిపోతాయి.

ఆర్ట్ క్రాప్టింగ్

మిగిలిపోయిన పువ్వుల్లో కొన్నింటితో సబ్బులు తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా పూల రేకులు గొప్ప స్క్రబ్ గా కూడా ఉపయోగపడుతాయని చెబుతున్నారు నిపుణులు.

సోప్స్