గరం మసాలా, జీలకర్ర వన్ టీస్పూన్, ధనియాలు వన్ టీస్పూన్, గసగసాలు 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 10, కొబ్బరి తురుము కప్పు, లవంగాలు నాలుగు, యాలకులు మూడు, దాల్చిన చెక్క, బగార ఆకు ఒకటి.
కావాల్సిన పదార్థాలు
చికెన్ కుర్మా కోసం ముందుగా చికెన్ శుభ్రంగా కడికి, దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటికి చిటికెడు పసుపు, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
చికెన్ శుభ్రపరచడం
తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి ధనియాలు, గసగసాలు జీడిపప్పు, కొబ్బరి తురుము వేసి కలపాలి, చల్లారిన తర్వాత నీల్లుపోసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.
మెత్తడి మసాలా పేస్ట్
ఆ తర్వాత స్టవ్ పెట్టి నూనె పోసి, అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగార ఆకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
ప్రిపరేషన్
తర్వాత ఇందులో చికెన్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడ, ఉప్పు కారం వేసి కలిపి, ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేయాలి.
చికెన్ వేయించుకోవాలి
తర్వాత మెల్లిగా నీల్లు పోసి, కొంచెం పెరుగు వేసి లో ప్లేమ్‌లో ఉడకబెట్టుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత గ్రేవీ వస్తుంది. అంతే టేస్టీ టేస్టీ చికెన్ కుర్మా రెడీ.