ఆ వ్యాధులకు దివ్యౌషధం..  స్టార్ ఫ్రూట్‌తో సూపర్ బెన్ఫిట్స్.. 

Samatha

9  February 2026

స్టార్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

స్టార్ ఫ్రూట్

చాలా మంది ఎన్నో రకాల పండ్లు తింటారు, బ్లూ బెర్రీస్, యాపిల్స్, అరటి, కానీ వీటన్నింటి కంటే స్టార్ ఫ్రూట్‌తో చాలా లాభాలు ఉన్నాయంట.

పోషకాలు

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని సూపర్ ఫ్రూట్ అంటారు.

సూఫర్ ఫ్రూట్

ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఇది  జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

జీర్ణ సమస్యలు

అలాగే స్టార్ ఫ్రూట్‌లో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

గుండె ఆరోగ్యం

ముఖ్యంగా అన్ని పండ్లలో కెళ్లా,  స్టార్ ఫ్రూట్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన బరువు తగ్గే వారికి ఇది చాలా బెస్ట్.

బరువు నియంత్రణ

స్టార్ ఫ్రూట్‌లో సోడియం, పొటాషియం, ఖనిజాలు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇది రక్త పోటును అదుపులో ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

రక్త పోటు

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

రోగనిరోధక శక్తి