రోజ్ డే స్పెషల్.. ప్రేమలో ఏ గులాబీ రంగు దేనికి సంకేతమో తెలుసుకోండి!
Samatha
7 February 2026
చాలా మంది ఎంతో ఇష్టమైన వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ప్రేమికులకు ఇంది చాలా స్పెషల్ వీక్ అని చెప్పాలి.అయితే వాలెటైన్స్ వీక్‌లో మొదటి రోజు ( ఫిబ్రవరి7) రోజ్ డే.
వాలెంటైన్స్ వీక్
ఈరోజు ప్రేమికులు అందమైన గులాబీని ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. చాలా రంగుల గులాబీలు ఉంటాయి, కాగా, ఏ రంగు దేనికి సంకేతమో ఇప్పుడు చూద్దాం.
రోజ్ డే
ఎరుపు రంగు గులాబీ ప్రేమకు చిహ్నం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ, మనసులోని ప్రేమను ఎరుపు రంగు గులాబీ ఇచ్చి వ్యక్త పరచవచ్చును.
రెడ్ రోజ్
తెలుపు గులాబీ స్వచ్ఛమైన ప్రేమకు గుర్తు. మీ ప్రేమలోని నిజాయితీని, స్వచ్ఛతను తెలుపు రంగు గులాబీ ఇచ్చి వ్యక్తపరచండి.
వైట్ రోజ్
పింక్ కలర్ గులాబీ : పింక్ కలర్ అనేది ఆనంద, కృతజ్ఞత, సంబంధాలను సూచిస్తుంది. ఇది ఇద్దరి మధ్య ప్రేమను వ్యక్త పరుస్తుంది.
పింక్ రోజ్
పసుపు రంగు గులాబీ : పసుపు రంగు గులాబీ స్నేహానికి గుర్తు, ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమను సూచిస్తుంది. స్నేహపూర్వకమైన ప్రేమకు గుర్తు.
ఎల్లో రోజ్
ఆరెంజ్ గులాబీ : ఇది స్నేహం, ప్రేమను తెలియజేస్తుంది. మీరు మీ స్నేహంలోని ప్రేమను తెలియబరచడానికి, లేదా కొత్తగా మీ బంధాన్ని మొదలు పెట్టడాన్ని ఇది సూచిస్తుంది.
ఆరెంజ్ రోజ్
పర్పుల్ గులాబీ : ఇది మీలోని రహస్య ప్రేమను సూచిస్తుంది. అంటే మీరు తొలి చూపులో మీ మనసులో కలిగిన భావనను వ్యక్తపరచడాన్ని ఇది సూచిస్తుంది.