వాలెంటైన్స్ వీక్ 2026 : ఏడు రోజుల ఏడు జన్మల బంధం కావాలా.. స్పెషల్ డేస్ ఇవే!

Samatha

3 February 2026

2026 వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఫిబ్రవరి 14 శని వారం రోజున ప్రేమికుల రోజు జరుపుకోనున్నారు. అయితే వాలెంటైన్స్ డే అంటే ఒక రోజు కాదు, వారం రోజులు జరుపుకుంటారు.

వాలెంటైన్స్ డే

అయితే ఈ ఏడు రోజులు మీ జీవితంలో ఏడు జన్మల బంధం కావాలా.. అయితే ఏ రోజు ఏ స్పెషల్,మీ భాగస్వామిని సర్ప్రైజ్ చేయడానికి బెస్ట్ డే ఏంటో తెలుసుకోండి.

వాలెంటైన్స్ డే వీక్

ఫిబ్రవరి 7,రోస్ డే.. ఈ రోజు మీ భాగస్వామికి అందమై గులాబీని ఇచ్చి, మీ ప్రేమను వ్యక్త పరచండి. దీని వలన మీ బంధం మరిత బలపడుతుంది.

రోస్ డే

ఫిబ్రవరి 8,ప్రపోజ్ డే.. భావాలను వ్యక్తపరచడం ఒక కళ.. అయితే ప్రపోజ్ డే రోజు మీలోని ప్రేమను కవిత రూపంలో మార్చి, మర్చిపోలేని విధంగా ప్రేమను వ్యక్తపరచండి.

ప్రపోజ్ డే

ఫిబ్రవరి 9,చాక్లెట్  డే : అమ్మాయిలకు చాక్లెట్స్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే తనకు ఇష్టమైన చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చి, మీ ప్రేమను తెలియజేయండి.

చాక్లెట్ డే

ఫిబ్రవరి 10,టెడ్డీ డే : ఈ రోజున అందమై టెడ్డీని గిఫ్ట్ గా ఇచ్చి, మీ బంధం ఏడు జన్మల వరకు ఆనందంగా సాగిపోవాలని.. ఎక్కడ ఉన్నా టెడ్డీ రూపంలో తోడుగా ఉంటాను అని చెప్పండి.

టెడ్డీ డే

ఫిబ్రవరి 11,ప్రామిస్ డే : ఈ రోజున మీ  ప్రేమ ఒక రోజు, ఒక సంవత్సరం, ఒక జన్మ మాత్రమే కాదు, ఏడు జన్మల్లో తోడుగా, నీడగా ఉంటాను అంటూ మీరు ప్రేమించిన వారికి ప్రామిస్ చేసి మద్ధతునివ్వండి.

ప్రామీస్ డే

ఫిబ్రవరి 12,హగ్ డే : మాటల కంటే కొన్ని సార్లు హగ్ అనేది ప్రేమను , భావాలను వ్యక్తపరుస్తుంది అంటారు. తనపై మీకు ఉన్న ప్రేమను హగ్ ద్వారా తెలియజేయండి.

హగ్ డే

ఫిబ్రవరి 13, కిస్ డే : మీ భాగస్వామికి కిస్ ఇచ్చి, మీలోని ప్రేమను వ్యక్త పరచండి, వారికి ఇష్టమో లేదో తెలుసుకొని ఇవ్వడం మీలోని నిజాయితీని సూచిస్తుంది. బంధం బలపడుతుంది.

కిస్ డే

ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే : ఈ ప్రేమికుల దినోత్సవం మీ భాగస్వామి జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం అయ్యే విధంగా, తనతో టైమ్ స్పెండ్ చేయండి.

వాలెంటైన్స్ డే