పుష్యమి నక్షత్రంలో బడ్జెట్.. ఇది ఎవరికి కలిసి వస్తుందో తెలుసా?
Samatha
31 January 2026
ప్రస్తుతం అందరి చూపు బడ్జెట్ పైనే ఉంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తొమ్మిదవ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
బడ్జెట్
దీంతో ప్రతి ఒక్కరూ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది? ఇది ఎవరికి ప్రయోజనాలు చేకూరుస్తుంది? ఏ ధరలు తగ్గనున్నాయి, ఎవరి ఉపశమనం కలిగిస్తుందో చూడాలని వేయిట్ చేస్తుంటారు.
బడ్జెట్ ప్రభావం
అయితే ఈ బడ్జెట్ పై జ్యోతిష్య శాస్త్రం ప్రభావం కూడా ఉండనున్నదంట. ఫిబ్రవరి 1 ఆదివారం చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు.
జ్యోతిష్య శాస్త్ర ప్రభావం
అంతే కాకుండా మాఘ శుక్ల పక్ష పూర్ణిమ, పుష్యమి నక్షత్రంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. అందువలన ఇది మహిళలకు, రైతులకు, సామాన్యలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నదంట.
ఎవరికి ఊరట అంటే?
పుష్యమి నక్షత్రం డబ్బు, ఆర్థిక స్థిరాత్వాన్ని సూచిస్తుంది కాబట్టి, ప్రభుత్వం సామాన్యులకు వరాలనిచ్చే విధంగా ఉన్నప్పటికీ ఖజానాపై అధిక భారం పడకుండా ఉంటుందంట.
ఆర్థిక స్థిరత్వం
ఫిబ్రవరి ఒకటి రాహు కాలం సాయంత్రం, 4,47 నుంచి 6.9 నిమిషాల వరకు ఉంటుంది, రాహువు బడ్జెట్ పై ప్రతికూల ప్రభావం చూపడం వలన ఇది పెట్టుబడు దారులకు కాస్త ప్రయోజనాలు చేకూర్చే ఛాన్స్ ఉన్నదంట.
రాహువు ప్రభావం
మధ్య తరగతి వారికి కాస్త ఊరటనిచ్చే పథకాలు ఉండే అవకాశం ఉన్నదంట. అంతే కాకుండా ఈ సారి బడ్జెట్ పేదలు, మహిళలకు ఉపయోగపడే పథకాలపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉన్నదంట.
మధ్యతరగతి ప్రజలు
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.