ఆస్తమాకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు.. ఫాలో అవుతే ప్రాబ్లం ఉండదు!
Samatha
31 January 2026
ప్రస్తుతం చాలా మంది ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆస్తమా పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్తమా
ఆస్తమా ఉన్న వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పరిచి, ఉబ్బసం తగ్గించుకోవడానికి మీ జీవనశైలిలో చాలా మార్పులు చేసుకోవాలంట.
ఆరోగ్య జాగ్రత్తలు
ముఖ్యంగా కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. కానీ తప్పకుండా ఆస్తమా పేషెంట్స్ వ్యాయామం చేయడం, శారీరకమైన శ్రమ చేయడం తప్పనిసరి.
శారీరక శ్రమ
అదే విధంగా ఇంటిని, వాడే వస్తువులను ,దుస్తులను ఎప్పుడూ దుమ్ము లేకుండా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
దుమ్ము
నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. మరీ ముఖ్యంగా ఆస్తమాతో బాధపడే వారు, తప్పకుండా కనీసం రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలంట. ఇది ళ్లేష్మాన్ని పలుచగా ఉంచి, ఊపిరి తీసుకోవడానికి సహాయపడుతుంది.
నీరు
దుమ్ము, ధూళి, పుప్పొడి వంటిది, ఎక్కువగా డస్ట్ ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలంట. ఇది సమస్యలను తీవ్రతరం చేస్తుంది, అలెర్జీని కలిగిస్తుంది.
డస్ట్
ధూమ పానం, మధ్యపానం ఆరోగ్యానికి హానికరం, మరీ ముఖ్యంగా ఆస్తమాతో బాధపడేవారు దీనికి చాలా దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ధూమ పానం
పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు ఆహారంలో చేర్చుకోవడం, రోజు తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.