ప్రతి ఒక్కరూ కూరల్లో ఉపయోగించే వాటిలో పచ్చి మిర్చి తప్పకుండా ఉంటుంది. ఇది చాలా ఘాటు, కారంగా ఉంటుంది, వంటకాలకు మంచి టేస్ట్ ఇస్తుంది.
పచ్చి మిర్చి
అయితే చాలా మంది ఇది కారం ఉంటుందని, ఎక్కువ వంటల్లో ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు, కానీ పచ్చి మిర్చితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
కారం
ముఖ్యంగా వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది క్యాన్సర్‌కు చెక్ పెడుతుందని చెబుతున్నారు నిపుణులు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
క్యాన్సర్‌కు చెక్
రీసెంట్‌గా జరిపిన కొన్ని అధ్యాయనాల ప్రకారం, పచ్చి మిర్చి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుందంట.
అధ్యయనాలు
పచ్చి మిర్చిలో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.
విటమిన్స్
ముఖ్యంగా ఇందులో క్యాప్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. దీని వలన కారం, ఘాటు లాంటి ప్లేవర్ వస్తుంది. అంతే కాకుండా ఇది కొన్ని రకాల కణాలను నిరోధిస్తుందంట.
క్యాప్సైసిన్
ముఖ్యంగా శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇది నిరోధిస్తున్నట్లు పరిశోధకులు తెలియ చేస్తున్నారు. అయితే ఇది కేవలం జంతువలపై జరిపిన అధ్యయనంలో వెళ్లడైందంట.
జంతువులపై జరపిన అధ్యయనం
ఇక మనుషులలో ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని వారు పేర్కొన్నారు.