వేడి నీరు, చల్లటి నీరు.. ఏ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదంటే?
Samatha
04 march 2026
నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంత మంది చల్లటి నీళ్లు తాగితే మరికొంత మంది వేడి నీరు తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
నీరు
అయితే చల్లటి నీళ్లు, వేడి నీళ్లు, ఈ రెండింటిలో తేడా ఏమంది? ఏ నీరు శరీరం పై ఏ మాత్రం ప్రభావం చూపుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
చల్లటి, వేడి నీరు
వేడి నీటికి, చల్లటి నీటికి మధ్య అతి ముఖ్యమైన వ్యత్యాసం దాని ఉష్ణోగ్రత. చల్లటి నీరు సాధారణంగా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద, దాదాపు 15-25°C ఉంటుంది.
ఉష్ణోగ్రత
చల్లటి నీరు చాలా చల్లగా ఉంటుంది. అంటే దాని ఉష్ణోగ్రత దాదాపు 5-15°C ఉంటుంది. అయితే ఈ నీటితో స్నానం చేసిన సమయంలో జలదరింపు వస్తుంది.
చల్లటి నీరు
ఇక ఈ నీరు తాగినప్పుడు కాస్త చల్లగా అనిపించినప్పటికీ, తర్వాత ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది. కానీ వేడి నీరు శరీరానికి చాలా మేలు చేస్తుంది.
వేడి నీటితో ఆరోగ్యం
వేసవి రాగానే ప్రజలు చల్లటి నీరు తాగడం ప్రారంభిస్తారు, శీతాకాలంలో చాలా మంది గోరువెచ్చని నీరు తాగుతారు. నీరు ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంటుంది, కాబట్టి దానికి ఒకే స్వభావం ఉండదు.
స్వభావం
ఇక చాలా మంది వేసవి కదా అని ఎక్కువగా చల్లటి నీరు మాత్రమే తాగుతుంటారు. కానీ ఇది అనేక రకాల సమస్యలు, ముఖ్యంగా దగ్గు జలుబు, జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.
సమ్మర్ కూల్ వాటర్
అందువలన సీజన్ ఏదైనా సరే కనీసం రోజుకు 2.5 లీటర్ల నీరు తాగాలి. ముఖ్యంగా చల్లటి నీటికంటే, గోరు వెచ్చకటి నీరు తాగడం వలన శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. చర్మం మెరుస్తుంది.