చాణక్య నీతి : ప్రతి వ్యక్తి ముంగిస నుంచి నేర్చుకోవాల్సింది ఇదే!

Samatha

18 February 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేశాడు.

ఆచార్య చాణక్యుడు

చాణక్యుడు, బంధువులు, బంధుత్వం , మనీ గురించి చాలా విషయాలను తెలియజేయడం జరిగింది. అదే విధంగా కొన్ని జంతువుల నుంచి కూడా కొన్ని నేర్చుకోవాలని తెలిపాడు.

చాణక్య నీతి

ముఖ్యంగా ప్రతి వ్యక్తి  ముంగిస నుంచి ప్రతి వ్యక్తి కొన్ని విషయాల గురించి తప్పక తెలుసుకోవాలని చెబుతున్నాడు చాణక్యుడు. అవి ఏవో చూద్దాం.

ముంగిస

 ముంగిస చాలా ధైర్యం కలది. ముఖ్యంగా ఇది శత్రువులకు సైతం భయపడకుండా, తనను తాను రక్షించుకోవడానికి విపరీతమైన పోరాటం చేస్తుంది.

ధైర్యం

అలాగే శత్రువుకు కూడా భయపడకూడదు అనేది ముంగిస నుంచి నేర్చుకోవాలి. అలాగే తన కంటే పెద్దైన పామును కూడా ఇది ఓడిస్తుంది.

పాము

దీని బట్టి, గెలవాలంటే బలం ఉండటం ముఖ్యం కాదు, శత్రువుల బలం కంటే వ్యూహమే ముఖ్యం అనేది దీనిని చూసి ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి.

వ్యూహం

ఇది ప్రణాళికా ప్రకారం నడచుకుంటుంది. తన శత్రువు కనిపించినప్పుడు వెనకడుగు వేయకుండా వ్యూహంతో పోరాడి, విజయం అందుకుంటుంది.

విజయం

ఇలా ముంగిస నుంచి ధైర్యం, వ్యూహం నేర్చుకోవాలి. చాలా వరకు ముంగిస గర్జించకుండా పామును ఓడిస్తుంది. అంటే నిజమైన శక్తి ఆడంబరంలో కాదు, ఫలితంలోనే ఉంటుందని తెలుసుకోవాలి.

ధైర్యం, వ్యూహం