పాములంటే ప్రతి ఒక్కరికీ భయం ఉంటుంది. చాలా మంది వీటిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు. ఇక ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తాయి.
పాములు
ఇక పాములు కుబుసం విడుస్తుంటాయని చాలా మందికి తెలుసు. ఇవి కొన్ని సార్లు చిత్తడి ప్రదేశాలలో, పొలం గట్లపై పాము కుబుసాలు ఎక్కువగా కనిపిస్తాయి.
పాము కుబుసం
అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు పాములు కుబుసాలు ఎందుకు విడుస్తాయి? ఎన్ని రోజులకు ఒకసారి పాములు కుబుసాలు విడుస్తాయి? ఇది కుబుసం విచే సమయంలో మనం చూడవచ్చా?
పాము కుబుసం విడవడం
కాగా, ఇప్పుడు మనం పాములు కుబుసం విడిచే సమయంలో మనం చూడవచ్చా? చూస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
పాము కుబుసం విడవడం చూడొచ్చా?
పాములు తమ చర్మంపై కొత్త పొర ఏర్పడే సమయంలో పాత పొర, కుబుసాన్ని వదిలేస్తాయంట. ఈ సమయంలో పాములు చాలా ఇబ్బంది పడుతూ , ఆహారం తీసుకోకుండా చాలా కష్టంగా కుబుసాన్ని వదులుతాయంట.
పాము కు కొత్త పొర ఏర్పడటం
అంతే కాకుండా పాములు తమ కుబుసాన్ని విడిచే సమయంలో చాలా చురుకుగా ఉంటాయంట. అంతే కాకుండా అవి చిన్న అలికిడి జరిగా దాడి చేస్తాయంట.
అలర్ట్
అందుకే పాములు కుబుసం విడిచే సమయంలో వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా అది కుబుసం విడిచిన తర్వాత చాలా ఉత్సాహంగా మారుతుందంట.
దాడి చేసే ఛాన్స్ ఎక్కువ
ఏ మాత్రం అలికిడి జరిగినా దానిపై తీవ్ర దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట. అందుకే పాములు కుబుసం విడిచే సమయంలో వీలైనంత వరకు దానికి దూరంగా ఉండాలి.