పెరుగు అన్నంలోకి సూపర్ డిష్.. క్యారెట్ ఊరగాయ ఇంట్లో ఎలా చేయాలంటే?
పెట్టండి!
Samatha
13 February 2026
క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్యులు తప్పకుండా ప్రతి రోజూ ఒక క్యారెట్ అయినా తినాలని చెబుతుంటారు.
క్యారెట్
ఇక కొంత మంది పచ్చి క్యారెట్ తింటే కొందరు స్వీట్‌గా మరికొందరు క్యారెట్ కర్రీ వండుకొని తీసుకుంటుంటారు. కానీ క్యారెట్ ఊరగాయ కూడా పెట్టొచ్చంట. అది ఎలా అంటే?
క్యారెట్ ఊరగాయ
కావాల్సిన పదార్థాలు : క్యారెట్ కేజీ, నిమ్మకాయలు 4,ఉల్లిపాయలు , పసుపు చిటికెడు, ఆవాలు వన్ టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, నూనె.
కావాల్సిన పదార్థాలు
తయారీ విధానం : ముందుగా క్యారెట్ పై పొట్టు తరుముకోవాలి. తర్వాత వాటిని సన్నిని ముక్కల్లా కట్ చేసుకోవాలి.
తయారీ
దీని తర్వాత వాటిని ఒక బౌల్‌లోకీ తీకొని, వాటర్ లేకుండా ఉంటే అందులో నిమ్మకాయ రసం పోసి, అందులోనే కారం వేసి మంచిగా కలుపుకోవాలి.
తురమడం
అలాగే పసుపు, ఉప్పు వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఉప్పు, కారం
దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో కొంచెం నూనె వేసి, అది వేడి అయిన తర్వాత ఆవాలు, మెంతులు, ఎండు మిర్చీ, కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి.
పోపు
తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేయాలి. అంతే క్యారెట్ ఊరగాయ రెడీ, పెరుగు అన్నంలోకి ఇది అదిరిపోతుంది.